కరోనా మహమ్మారి సామాన్యుడి నుంచి సెలబ్రిటీల వరకు ఎవ్వరిని వదలడం లేదు. తాజాగా నటుడు మెగాస్టార్‌ చిరంజీవి కరోనా బారిన పడ్డారు. ఆచార్య సినిమా షూటింగ్‌లో భాగంగా కరోనా పరీక్షలు నిర్వహించుకోగా, పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని స్వయంగా చిరంజీవి ట్విట్టర్‌ వేదికగా వెల్లడించారు. ఆచార్య మూవీ షూటింగ్‌ ప్రారంభించాలని కోవిడ్‌ పరీక్ష్‌లు చేయించుకున్నారు. నాకు ఎలాంటి కరోనా లక్షణాలు లేవు.. వెంటనే హోం క్వారంటైన్‌ అయ్యాను. గత నాలుగైదు రజులుగా నన్ను కలిసిన వారందరిని పరీక్షలు చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఎప్పటికప్పుడు నా ఆరోగ్య పరిస్థితిని మీకు తెలియజేస్తాను..అని చిరు తెలిపారు.

కాగా, మూడు రోజుల కిందట ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి వరద సాయం అందించారు. చిరంజీవితో పాటు నాగార్జున కూడా ఉన్నారు. అలాగే ఆదివారం టీఆర్‌ఎస్‌ ఎంపీ సంతోష్‌ కుమార్‌, తన తనయుడు రామ్‌చరణ్‌తో చిరంజీవి సెల్ఫీ దిగారు.

Claim Review :  
Claimed By :  Unknown
Fact Check :  True

సుభాష్

.

Next Story