'సామ్ జామ్' షోలో మెగాస్టార్ చిరంజీవి.. ఫోటోలు వైర‌ల్‌

Chiranjeevi shoots for Samantha’s talk show ‘Sam Jam’, pics viral .. హీరోయిన్‌ అక్కినేని సమంత వ్యాఖ్యాతగా ఆహా డిజిటల్

By సుభాష్  Published on  19 Nov 2020 6:59 PM IST
సామ్ జామ్ షోలో మెగాస్టార్ చిరంజీవి.. ఫోటోలు వైర‌ల్‌

హీరోయిన్‌ అక్కినేని సమంత వ్యాఖ్యాతగా ఆహా డిజిటల్‌ ప్లాట్‌ ఫామ్‌లో ప్రసారమవుతున్న టాక్‌ షో 'సామ్‌ జామ్'‌. తెలుగులో ఇప్పటి వరకు ఎన్నో టాక్ షో లు వచ్చాయి. సమంత టాక్ షో చాలా విభిన్నంగా ఉంటుందంటూ అల్లు అరవింద్ మీడియా సమావేశం సందర్బంగా చెప్పాడు. అయితే మొదటి ఎపిసోడ్ విజయ్ దేవరకొండో స్ట్రీమింగ్ చేయగా ప్రేక్ష‌కుల‌ను పెద్ద‌గా ఆక‌ట్టుకోలేదనే టాక్ వినిపిస్తోంది.

దీంతో రెండో ఎపిసోడ్ కోసం ఏకంగా మెగాస్టార్ చిరంజీవినే తీసుకొచ్చింది సామ్ జామ్ ప్రోగాం టీమ్. ఎపిసోడ్ చిరంజీవితో ఆకట్టుకునేలా ప్లాన్ చేస్తున్నట్లుగా చెబుతున్నారు. నందిని రెడ్డి ప్రొగ్రాం ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న ఈ టాక్ షో రెండవ ఎపిసోడ్ పై అందరి దృష్టి ఉంది. సాధార‌ణంగా చిరంజీవి టాక్ షోల‌లో త‌క్కువ‌గా పాల్గొంటారు. మ‌రీ చిరంజీవి నుంచి స‌మంత ఏఏ విష‌యాల‌ను రాబ‌ట్టిందోన‌ని అభిమానులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే.. సామ్ జామ్ టాక్‌లో పాల్గొన్న ఫోటోల‌ను నిర్మాత బీఏ రాజు తన ట్విటర్‌లో పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి.

పూర్తిస్థాయిలో ఓ షోకు సమంత్‌ హోస్ట్‌గా చేయడం ఇదే తొలిసారి. నవంబర్‌13న ఈ షో లాంఛనంగా ప్రారంభమవ్వగా.. మొదటి ఎపిసోడ్‌లో అర్జున్‌ రెడ్డి హీరో విజయ్‌ దేవరకొండ సెలబ్రిటీగా వచ్చారు. మున్ముందు ఎపిసోడ్‌లలో తమన్నా, రష్మిక మందన, సైనా నెహ్వాల్‌, కశ్యప్‌ పారుపల్లి, అల్లు అర్జున్‌ కూడా సమంత షోలో కనువిందు చేయనున్నట్లు తెలుస్తోంది.

Next Story