OTTలోకి వచ్చేస్తోన్న 'చంద్రముఖి-2'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
హార్రర్ మూవీ చంద్రముఖి-2 ఓటీటీలో స్ట్రీమింగ్‌కు రెడీ అవుతోంది.
By Srikanth Gundamalla Published on 17 Oct 2023 1:39 PM ISTOTTలోకి వచ్చేస్తోన్న 'చంద్రముఖి-2'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
రాఘవ లారెన్స్, కంగనా రనౌత్ లీడ్ రోల్స్ లో నటించిన సినిమా చంద్రముఖి 2. 2005లో వచ్చిన చంద్రముఖి మూవీకి ఇది సీక్వెల్ గా తెరకెక్కింది. అప్పుడు రజనీకాంత్, జ్యోతిక చేసిన పాత్రలను ఇప్పుడు లారెన్స్, కంగనా చేశారు. సెప్టెంబర్ 28న పాన్ ఇండియన్ లెవెల్‌లో రిలీజైన ఈ మూవీ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. అయితే.. ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
చంద్రముఖి-2 సినిమా డిజటల్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకోంది. ఈ మూవీ అక్టోబరు 27 నుంటి నెట్‌ఫ్లిక్స్‌లో (Netflix) స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. తమిళం, తెలుగుతో పాటు మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో చంద్రముఖి 2ను అందుబాటులోకి తీసుకురానున్నారు. పి.వాసు దర్శకత్వం వహించిన ఈ మూవీలో మహిమా నంబియార్, లక్ష్మీ మీనన్, సుభీక్ష కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీ తమిళంలో బాగానే ఆడినప్పటికీ.. తెలుగులో మాత్రం ఆ స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. కథ, కథనం, టేకింగ్ ఏది కూడా కొత్తగా లేకపోవడం.. పై పెచ్చు గ్రాఫిక్స్ దరిద్రంగా ఉండటంతో జనాలు చంద్రముఖి-2 సినిమాను తిప్పి కొట్టారు. అసలు లారెన్స్ ఈ కథను ఎలా ఒప్పుకున్నాడో అతనికే తెలియాలంటూ ఆయన ఫ్యాన్స్ తీవ్రంగా నిరాశపడ్డారు. అయితే పోటీగా ఎలాంటి సినిమాలు లేకపోవడంతో కొంత వరకు ప్రొడ్యూసర్‌లకు ఈ సినిమా నష్టాలు మిగిల్చింది. నెట్‌ఫ్లిక్స్‌లో అక్టోబర్ 27 నుంచి స్ట్రీమింగ్‌పై త్వరలోనే ప్రకటన వచ్చే చాన్స్ ఉంది.