'చంద్రముఖి-2' సినిమా నుంచి కంగనా ఫస్ట్‌ లుక్‌ రిలీజ్

చంద్రముకి-2లో ప్రధాన పోషిస్తున్న కంగనా రనౌత్‌ ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేశారు చిత్ర యూనిట్.

By Srikanth Gundamalla  Published on  5 Aug 2023 12:54 PM IST
Chandramukhi-2, Movie, Kangana Ranaut, First look,

'చంద్రముఖి-2' సినిమా నుంచి కంగనా ఫస్ట్‌ లుక్‌ రిలీజ్

అప్పట్లో వచ్చిన చంద్రముఖి సినిమాకు చాలా క్రేజ్‌ వచ్చింది. ప్రేక్షకులను ఎంతో భయపెట్టింది. ఆ సినిమా ఇప్పటికీ టీవీల్లో వస్తే కొందరు పూర్తిగా చూసేవరకు వదలరు. రజనీకాంత్, నయనతార, జ్యోతిక, ప్రభు ప్రధాన పాత్రల్లో నటించిన చంద్రముఖి సినిమా రికార్డు స్థాయి వసూళ్లను రాబట్టింది. విద్యాసాగర్‌ సంగీతం ప్రధాన పాత్రను పోషించింది. అయితే.. ఈ సినిమా తర్వాత చంద్రముఖి తరహాలో రెండుమూడు సినిమాలు వచ్చినా అంత ఆకట్టుకోలేకపోయాయి. తాజాగా చంద్రముఖి సినిమాకు సీక్వెల్‌ వస్తోంది.

మొదటి భాగాన్ని తెరకెక్కించిన పి.వాసు.. సీక్వెల్‌కు కూడా డైరెక్షన్‌ చేస్తున్నారు. దీనికి చంద్రముకి-2గానే రూపొందిస్తున్నారు. అయితే.. ఇప్పటికే సినిమా నుంచి రాఘవలారెన్స్‌ పోస్టర్‌ విడుదలైంది. తాజాగా ప్రధాన పోషిస్తున్న కంగనా రనౌత్‌ ఫస్ట్‌ లుక్‌ను కూడా విడుదల చేశారు చిత్ర యూనిట్. టైటిల్‌ రోల్‌ను కంగనా రనౌత్ పోషించారు. డిఫరెంట్‌ కాస్ట్యూమ్స్‌తో కంగనా చాలా కొత్తగా.. బ్యూటిఫుల్‌గా కనిపిస్తున్నారు. చీరతో భారీగా నగలు ధరించారు. ఒక ప్యాలెస్‌ లోపల నిలబడి కెమెరా నుంచి దూరంగా చూస్తోంది. "అప్రయత్నంగా మన దృష్టిని దొంగిలించే అందం, భంగిమ.. చంద్రముఖి-2 నుంచి చంద్రముఖిగా కంగనా రనౌత్ ఫస్ట్ లుక్.." అంటూ మూవీ మేకర్స్ క్యాప్షన్ ఇచ్చారు. చంద్రముఖిలో జ్యోతిక తన కళ్లతోనే ఆకట్టుకుంది. ఈ మూవీలో కంగనా ఎలా మెప్పిస్తుందో చూడాలి. ప్రస్తుతం కంగనా ఫస్ట్ లుక్ నెట్టింట వైరల్ అవుతోంది.

చంద్రముఖి-2 సినిమాను చిత్ర యూనిట్ పాన్‌ ఇండియా లెవల్‌లో తీసుకొస్తుంది. అందుకే ఈ సినిమాలో టైటిల్ పాత్రలో కంగనాను తీసుకున్నారు. మరో ప్రధాన పాత్రను లారెన్స్‌ పోషించారు. చాలా గ్యాప్ తర్వాత లారెన్స్‌ నటిస్తోన్న హారర్‌ థ్రిల్లర్ ఇది. మూవీకి కీరవాణి సంగీతం అందించారు. వినాయక చవితికి చంద్రముఖి-2 ప్రేక్షకులకు ముందుకు వచ్చి భయపెట్టనుంది.


Next Story