‘ఫాస్ట్‌ అండ్‌ ఫ్యూరియస్‌’ నటుడిపై లైంగిక ఆరోపణల కేసు

హాలీవుడ్‌ మూవీలో ఫాస్ట్‌ అండ్‌ ఫ్యూరియస్‌ నటుడు విన్ డీజిల్‌పై లైంగిక వేధింపుల ఆరోపణ కేసు నమోదు అయ్యింది.

By Srikanth Gundamalla
Published on : 22 Dec 2023 12:58 PM IST

case,  sexual allegations,  hollywood actor,

‘ఫాస్ట్‌ అండ్‌ ఫ్యూరియస్‌’ నటుడిపై లైంగిక ఆరోపణల కేసు 

హాలీవుడ్‌ సినిమాలను ఇంగ్లీష్‌లో కానీ.. డబ్బింగ్‌లో చూసే వారికి ‘ఫాస్ట్‌ అండ్‌ ఫ్యూరియస్‌’ తెలిసే ఉంటుంది. ఆ సినిమాలో ప్రధాన పాత్రలో కనిపించిన విన్‌ డీజిల్‌కు ఫ్యాన్స్‌కు అభిమానులు కూడా ఎక్కువే ఉంటారు. ఆయన ఇదొక్కటే కాదు.. మరికొన్ని సినిమాల ద్వారా కూడా తెలుగు ప్రేక్షకులకు పరిచయస్థుడు. అయితే.. ఈ విన్‌ డీజిల్‌పై తాజాగా లైంగిక ఆరోపణల కేసు నమోదు అయ్యింది. విన్ డీజిల్‌ మాజీ వ్యక్తిగత సహాయకురాలు ఆయనపై సంచలన ఆరోపణలు చేసింది. 2010లో ఫాస్ట్‌ అండ్‌ ఫ్యూరియస్ చిత్రానికి సీక్వెల్‌ చిత్రీకరణ సమయంలో తనపై విన్‌ డీజిల్‌ లైంగిక దాడి చేశారని ఆమె ఆరోపించారు.

దాదాపు 10 ఏళ్ల క్రితం అట్లాంటా హోటల్‌ గదిలో తన సహాయకురాలిగా ఉన్న ఎంఎస్‌ జోనాసన్‌పై విన్‌ డీజిల్‌ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని కోర్టులో వ్యాజ్యం దాఖలు అయ్యింది. కాలిఫోర్నియాలోని కోర్టులో పిల్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం చట్టపరమైన చర్య తీసుకునేందుకు కొంత సమయాన్ని పొడిగించింది. ఈ లోపు ఆమె ఆరోపణలపై విచారించాలని కోర్టు సూచించింది.

విన్‌ డీజిల్‌కు అసిస్టెంట్‌గా పనిచేసిన సమయంలో ఏం జరిగిందో బాధితురాలు ఇలా తెలిపింది... ఫాస్ట్‌ ఫైవ్ చిత్రీకరణ కోసం యూనిట్‌ మొత్తం అట్లాంటాకు వెళ్లాం. అక్కడ షూటింగ్ పూర్తి అయిన తర్వాత అందరూ రూముకి చేరుకున్నాం. తర్వాత ఇరోజు షూట్‌ కోసం విన్ డీజిల్‌కు కావాల్సిన ఏర్పాట్లను చేశాను. నేను.. అతను గదిలోకి వెళ్లిన సమయంలో ఇద్దరమే ఉన్నాం. ఒంటరిగా ఉన్న విన్ డీజిల్‌ తనపై లైంగిక వేధింపులకు పాల్పడాడనీ.. బలవంతంగా పట్టుకుని అసభ్యంగా ప్రవర్తించాడని ఎంఎస్‌ జోనాసన్‌ పిటిషన్‌లో పేర్కొంది. ఆ తర్వాత తప్పించుకుని బాత్రూమ్‌లోకి పారిపోయానని తెలిపింది. ఇదంతా జరిగిన మరుసటి రోజు.. విన్‌ డీజిల్‌ సోదరి సమంత విన్సెంట్‌కు విషయమంతా చెప్పానని వివరించింది. కానీ వారేమీ పట్టించుకోలేదని ఆరోపించింది. ఆతర్వాత ఉద్యోగం నుంచి కూడా తొలగించారని వాపోయింది.

విన్ డీజిల్, సమంత విన్సెంట్‌ వల్ల తాను ఎంతో కెరియర్‌ కోల్పోయానని ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు జరిగిన నష్టాన్ని పూరించాలని కోర్టును కోరింది బాధితురాలు. ఆమె వేసిన పిల్‌పై విన్‌ డీజిల్‌ ప్రతినిధులు ఇంకా స్పందించలేదు.

Next Story