త‌న గారాల ప‌ట్టి అర్హకు సర్‌ప్రైజ్ ఇచ్చిన బ‌న్నీ

Bunny Surprise Gift.. టాలీవుడ్‌ స్టార్‌ అల్లు అర్జున్ గారాల ప‌ట్టి అర్హ పుట్టిన రోజు నేడు. కూతురు అంటే బ‌న్నీకి ఎంత

By సుభాష్  Published on  21 Nov 2020 6:01 AM GMT
త‌న గారాల ప‌ట్టి అర్హకు సర్‌ప్రైజ్ ఇచ్చిన బ‌న్నీ

టాలీవుడ్‌ స్టార్‌ అల్లు అర్జున్ గారాల ప‌ట్టి అర్హ పుట్టిన రోజు నేడు. కూతురు అంటే బ‌న్నీకి ఎంత ప్రేమో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. అర్హతో చేసే అల్లరి చేష్టలు, ముద్దు ముద్దుగా మాట్లాడే వీడియోలను ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో అభిమానులతో పంచుకుంటారు. తాత‌, తాడీల‌ను ఈ అల్ల‌రి గ‌డుగ్గాయ్ తెగ ఏడిపించేస్తూ ఉంటుంది.

2016 నవంబర్‌ 21 జన్మించిన అర్హ నాలుగేళ్లు పూర్తి చేసుకొని అయిదో ఏడాదిలోకి అడుగుపెడుతోంది. ఈ సందర్భంగా తన కూతురికి బన్నీ స్పెషల్‌ గిఫ్ట్‌ ఇచ్చాడు. పుట్టినరోజు శుభాకాంక్ష‌లు తెలుపుతూ.. గుర్రంపై కూర్చోబెట్టాడు. అంతేకాకుండా ఓ గిప్టును కూడా అంద‌జేశాడు. 'పుట్టిన రోజు శుభాకాంక్షలు మై డియర్‌ అర్హ. నీ క్యూట్‌నెస్‌, అల్లరిని నాకు అందించినందుకు థ్యాంక్యూ మై లిటిల్‌ ఏంజెల్‌' అని కూతురికి గిఫ్ట్‌ ఇస్తున్న ఫోటోను ట్విటర్‌లో షేర్‌‌ చేశారు. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

'అల వైకుంఠపురములో' చిత్రంతో భారీ విజ‌యాన్ని అందుకున్న బ‌న్నీ.. ప్ర‌స్తుతం సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప' సినిమా చేస్తున్నాడు. కరోనా వల్ల వాయిదా పడిన ఈ సినిమా షూటింగ్‌ ఇటీవలే తిరిగి ప్రారంభమైంది. ఎర్ర చందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్నీకి జోడిగా రష్మిక మందన న‌టిస్తోంది.


Next Story