రూ.లక్ష విలువైన "బ్రో" సినిమా షూ గిఫ్ట్‌గా ఇచ్చిన నిర్మాత

బేబీ సినిమా డైరెక్టర్‌ కు నిర్మాత ఎస్‌కేఎన్‌ 'బ్రో' సినిమాలో పవన్‌ కళ్యాణ్‌ వేసుకున్న షూని బహుమతిగా అందించాడు.

By Srikanth Gundamalla  Published on  4 July 2023 11:48 AM IST
BRO, Movie Shoe, Gifted, Producer, Baby Movie, Director,

రూ.లక్ష విలువైన "బ్రో" సినిమా షూ గిఫ్ట్‌గా ఇచ్చిన నిర్మాత

సాధారణంగా సినిమాలు హిట్‌ అయిన తర్వాత హీరోలు, డైరెక్టర్లు, నిర్మాతలు బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. ఇదంతా మన టాలీవుడ్‌లోనే కాదే దాదాపుగా అన్ని ఇండస్ట్రీల్లో ఆనవాయితీగానే వస్తోంది. అయితే.. ఓ నిర్మాత మాత్రం సినిమా విడుదల అవ్వకముందే డైరెక్టర్‌కు కాస్ట్‌లీ గిఫ్ట్‌ ఇచ్చాడు. బేబీ సినిమా డైరెక్టర్‌ సాయి రాజేశ్‌కు నిర్మాత ఎస్‌కేఎన్‌ 'బ్రో' సినిమాలో పవన్‌ కళ్యాణ్‌ వేసుకున్న షూని బహుమతిగా అందించాడు. ఈ విషయాన్ని స్వయంగా డైరెక్టర్‌ సాయి రాజేశ్‌ తన ట్విట్టర్‌ అకౌంట్‌ ద్వారా తెలియజేశాడు.

'ఓ రెండు ప్రేమ మేఘాలిలా' ఈ పాట తెలుగు ఇండస్ట్రీనే ఊపేస్తుంది. ఎక్కడ విన్నా ఇదే పాట. అంతేకాదు.. రీల్స్‌ కూడా చేస్తున్నారు నెటిజన్లు. విజయ్‌ దేవరకొండ తమ్ముడు ఆనంద్‌ దేవరకొండ నటిస్తోన్న సినిమా 'బేబీ'లోని పాటే ఇది. చాలా పెద్ద హిట్‌ అయ్యింది. అయితే.. సినిమా కూడా జూలై 14న థియేటర్లలో విడుదల కానుంది. సినిమా విడుదలకు ముందే డైరెక్టర్ సాయి రాజేశ్‌కు నిర్మాత ఎస్‌కేఎన్‌ గిఫ్ట్‌ పంపాడు. అది కూడా 'BRO' సినిమాలో పవన్‌ కళ్యాణ్‌ వేసుకున్న షూ. ఈ షూ పేరు బాలమైన్‌. వాటి ధర అక్షరాల రూ.1,06,870. ఈ ప్రొడ్యూసర్‌ ఇచ్చిన గిఫ్ట్‌తో సాయి రాజేశ్‌ ఎంతో ఆనందం వ్యక్తం చేశాడు.

డైరెక్టర్ సాయి రాజేశ్ ఇలా ట్వీట్‌ చేశాడు... 'మా నిర్మాత బ్రో 'బేబీ' సినిమా ఫస్ట్‌ కాపీని చూశారు. ఆ తర్వాత 'BRO' సినిమాలోని షూని గిఫ్ట్‌గా ఇచ్చారు. ఇంత కాస్ట్‌లీ షూ మళ్లీ కొనగలనా అనే ఆలోచన కూడా నన్ను భయానికి గురి చేస్తోంది' అని రాసుకొచ్చారు.

బేబీ సినిమాలో ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్‌ అశ్విన్‌ సహా తదితరులు నటించారు. సినిమాకు మ్యూజిక్‌ డైరెక్టర్‌గా విజయ్ బుల్గానిన్ పని చేశారు.

Next Story