'బ్రో' OTTలోకి వచ్చేస్తున్నాడు.. స్ట్రీమింగ్ ఎక్కడంటే
పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ కలిసి నటించిన సినిమా ఓటీటీలో అందుబాటులోకి రాబోతుంది.
By Srikanth Gundamalla Published on 20 Aug 2023 11:40 AM IST'బ్రో' OTTలోకి వచ్చేస్తున్నాడు.. స్ట్రీమింగ్ ఎక్కడంటే
మేనల్లుడు సాయిధరమ్ తేజ్‌తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలిసి నటించిన సినిమా 'బ్రో'. భారీ అంచనాల మధ్య ఈ సినిమా థియేటర్లలో విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. అయితే.. సినిమాను థియేటర్లలో చూడలేని వారు చాలా వరకు ఓటీటీలో తొందరగా వస్తే బాగుండు అనుకుంటారు. ఈ క్రమంలోనే బ్రో సినిమాను OTTలోకి తీసుకొస్తున్నారు. కొద్ది రోజుల తర్వాత మళ్లీ ఓటీటీలోకి వస్తుండటంతో ఫ్యాన్స్ కూడా మరోసారి ఈ సినిమాను చూసేందుకు సిద్ధమవుతున్నారు.
తమిళంలో సూపర్ హిట్ అయ్యిన వినోదయ సీతమ్ సినిమాను తెలుగులో 'బ్రో' పేరుతో రీమేక్ చేశారు. ఈ సినిమాకు సముద్రఖని దర్శకత్వం వహించారు. త్రివిక్రమ్ స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అందించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానరపై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. సహా నిర్మాతగా వివేక్ కూచిబొట్ల ఉన్నారు. తమిళంలో విడుదలైన సినిమాను మూలకథగా తీసుకుని పవన్ కళ్యాణ్ స్టార్‌డమ్‌కు తగ్గట్లుగా కొన్ని మార్పులు చేశారు. పవన్ కళ్యాణ్ వన్ మేన్ షో చేశారంటూ మూవీ విడుదలైన సందర్భంలో ఫ్యాన్స్ సందడి చేశారు. సాయిధరమ్ తేజ్ సరసన కేతిక శర్మ హీరోయిన్‌గా కనిపించారు. మరో హీరోయిన్‌గా ప్రియావారియర్ కనిపించారు.
'బ్రో' సినిమాలో ఒక యువకుడి తండ్రి చనిపోయాక అతడు ఎదుర్కొన్న సమస్యలను చూపించారు. పవన్, సాయి ధరమ్‌తేజ్ డైలాగ్స్ మెప్పించాయి. పవన్ కల్యాణ్ ఎంటర్‌టైన్మెంట్ యాంగిల్ బయటకొచ్చిందని ఫ్యాన్స్ ఖుషీ అయ్యారు. అయితే.. ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెటిఫ్లిక్స్ సొంతం చేసుకుంది. భారీ ధరకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అయితే.. ఆగస్టు 25 నుంచే బ్రో సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. పవన్ బర్త్‌డే సందర్భంగా సెప్టెంబర్ 2న విడుదల చేయాలని చూశారు. కానీ కొద్దిరోజుల ముందే ఓటీటీలో అందుబాటులోకి రానుంది. పవన్ బర్త్‌డేకు ముందే ఫ్యాన్స్‌కు ట్రీట్ వచ్చేసింది. కాగా.. బ్రో సినిమా శాటిలైట్ రైట్స్ జీతెలుగు సొంతం చేసుకుంది.