ఇటలీలో రోడ్డు ప్రమాదం, బాలీవుడ్ నటికి తీవ్రగాయాలు

ఇటలీలో రోడ్డుప్రమాదం సంభవించింది. బాలీవుడ్‌ నటి గాయత్రీ జోషితో పాటు ఆమె భర్త ఒబెరాయ్‌కి తీవ్రగాయాలు అయ్యాయి.

By Srikanth Gundamalla  Published on  4 Oct 2023 3:30 PM IST
bollywood actress, gayatri, car accident,  italy,

ఇటలీలో రోడ్డు ప్రమాదం, బాలీవుడ్ నటికి తీవ్రగాయాలు

ఇటలీలో రోడ్డుప్రమాదం సంభవించింది. ఈ సంఘటనలో బాలీవుడ్‌ నటి గాయత్రీ జోషితో పాటు ఆమె భర్త ఒబెరాయ్‌కి తీవ్రగాయాలు అయ్యాయి. విహారయాత్ర కోసం గాయత్రి ఆమె భర్తతో కలిసి ఇటలీలోని సార్డినియాకు వెళ్లింది. అక్కడ జరుగుతున్న లగ్జరీ కార్ల పరేడ్‌లో వీరు కూడా పాల్గొన్నారు. ఆ సమయంలోనే రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. కాగా.. గాయపడ్డవారి పరిస్థితి నిలకడగా ఉందని వికాస్ కార్యాలయ సిబ్బంది తెలిపింది.

పరేడ్‌లో భాగంగా టెయిలాడా నుంచి ఓల్బీయాకు వెళుతున్న క్రమంలో గాయత్రీ, ఆమె భర్త ప్రయాణిస్తున్న లంబోర్గిని కారు అదుపు తప్పి పక్కనే ఉన్న ఫెరారీ కారు, వ్యాన్‌ను ఢీకొంది. ఈ ప్రమాదం అనంతరం ఫెరారీ కారు మంటల్లో చిక్కుకుంది. కారులో ఉన్న ఉన్న మెలీసా క్రౌటిల్ (63), మార్కస్ క్రౌటిల్ (67) ప్రాణాలు కోల్పోయారు. గాయాలతో బాలీవుడ్ నటి గాయత్రీ జోషి, వికాస్ ఒబెరాయ్ బయపటడ్డారు. ఈ క్రమంలో వికాస్‌.. తాను ఇటలీలో ఉన్నామని నటి గాయత్రి జోషి తెలిపింది. అక్కడ ప్రమాదానికి గురైనట్లు చెబుతూ.. భగవంతుడి దయంతో క్షేమంగా బయటపడినట్లు పేర్కొంది. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు వెనుక వస్తున్న మరో కారు డాష్‌ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ ప్రస్తుతం ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. గాయత్రీ జోషి.. షారుఖ్‌ ఖాన్‌ చిత్రం స్వదేశ్‌లో హీరోయిన్‌గా నటించారు.

Next Story