బాలీవుడ్‌ నటుడు కన్నుమూత

Bollywood Actor Ashiesh roy Passes away ..ముంబై: ప్రముఖ బాలీవుడ్‌ నటుడు ఆశిష్‌ రాయ్‌ (55) కన్నుమూశారు. గత కొంత

By సుభాష్  Published on  24 Nov 2020 2:13 PM IST
బాలీవుడ్‌ నటుడు కన్నుమూత

ముంబై: ప్రముఖ బాలీవుడ్‌ నటుడు ఆశిష్‌ రాయ్‌ (55) కన్నుమూశారు. గత కొంత కాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన మంగళవారం ముంబైలో తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన ఇంట్లో పని చేసే సిబ్బంది తెలిపారు. తెల్లవారుజామున కుప్పకూలిపోయారు. గత కొన్ని నెలలుగా డయాలసిస్‌ జరుగుతోంది. ఆరోగ్య పరిస్థితి మెరుగు పడుతుందని అనుకునేలోపే ఇలా జరిగిపోయింది. ఆయన సోదరి కోల్‌కతా నుంచి సాయంత్రం ఇక్కడికి వస్తారు. అప్పుడే ఆయన అంత్యక్రియలు జరుగుతాయి అని తెలిపారు. కాగా, సినీ, టీవీ ఆర్టిస్టు అసోసియేషన్‌ ఆశిష్‌ రాయ్‌ మృతిపై సంతాపం వ్యక్తం చేశారు. కాగా, కిడ్నీలు పని చెడిపోవడంతో ఆస్పత్రిలో చేరిన ఆయనను బిల్లు కట్టలేదన్న కారణంగా ఈ ఏడాది జూన్‌లో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ చేశారు.

అప్పటి నుంచి ఇంట్లోనే ఉంటూ పెద్ద మనసుతో ఆదుకోవాలని అభిమానులు, సెలబ్రిటీలకు విజ్ఞప్తి చేశారు. తన వద్ద డబ్బులేదని,కానీ బతకాలని ఉందంటూ తన ధీనస్థితిని వివరించారు. స్మలాన్‌ఖాన్‌ వంటి అగ్రహీరోలను కూడా సాయం కోరాడు. అయినా ఎలాంటి ఫలితం లభించలేదంటూ గతంలో ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆశిష్‌ రాయ్‌ చెప్పుకొచ్చారు.ఫిల్మ్‌ మేకర్‌ హన్సల్‌ మెహతా , అశ్విని చౌదరి సహా నటులు సూరజ్‌ థాపర్‌, ఆసిఫ్‌ తదితరులు సోషల్‌ మీడయా వేదికగా నివాళులు అర్పించారు. ఆశిష్‌ రాయ్‌ పలు సినిమాల్లో నటించారు. బనేగీ అప్నీ బాత్‌, ససురాల్‌ సిమర్‌ కా, కుచ్‌ రంగ్‌ ప్యార్‌ కేఐసేభీ వంటి హిందీ హిట్‌ సీరియల్స్‌లో కనిపించి బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు.


Next Story