హారిక గెలుపు వల్ల అఖిల్‌, మోనాల్‌ మధ్య చిచ్చు

Biggboss-4: Akhil's anger on Monal I బిగ్‌బాస్‌ .. బిగ్‌బాస్‌ ఇచ్చిన ఇమ్యూనిటీతో కష్ట పడకుండా వారంలో కెప్టెన్సీ సాధించిన

By సుభాష్  Published on  21 Nov 2020 10:37 AM IST
హారిక గెలుపు వల్ల అఖిల్‌, మోనాల్‌ మధ్య చిచ్చు

బిగ్‌బాస్‌ ఇచ్చిన ఇమ్యూనిటీతో కష్ట పడకుండా వారంలో కెప్టెన్సీ సాధించిన అఖిల్‌.. ఈసారి కెప్టెన్సీ పోయినందుకు తెగ బాధపడ్డాడు. మరో వైపు హారికను మోనాల్‌ గెలిపించడం అఖిల్‌కు కోపం తెప్పించింది. దీంతో సోహెల్‌ దగ్గర తన బాధనంతా వెళ్లగక్కుకున్నాడు. ఇక అఖిల్‌ను ఓదార్చేందుకు వచ్చిన మోనాల్‌పై అలిగాడు. అయితే హారిక తనను నమ్మిందని, కానీ నువ్వు నమ్మలేదని చెప్పుకొచ్చింది. నన్ను ఒక ఐదు నిమిషాలు వదిలేస్తావా..అని అనడంతో మోనాల్‌ అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఆ తర్వాత పొద్దున అవినాష్‌, లాస్య, హరియానా అందరూ సపోర్టు చేస్తున్నట్లు చెప్పారు. కానీ ఆ సపోర్ట్‌ అంతా ఎక్కడికిపోయింది అని తన బాధను చెప్పుకొచ్చాడు.

హారికపై అభిజిత్‌ జోకులు

మరోసారి కెప్టెన్‌ అయిన హారికపై అభిజిత్‌ జోకులు వేశాడు. ఎంత పని చేశావ్‌ మోనాల్‌.. ఆమెను ఎందుకు కెప్టెన్‌ చేశావు అని హారికను ఆటపట్టించాడు. నా మీద జోకులు వేస్తే ఊరుకోవాలి. నీ మీద వేస్తేనేమో సీరియస్‌ అవుతావు. ఇంకోసారి నేను జోకులు వేసినప్పుడు సీరియస్‌ అయితే నీ పని చెప్తా అంటూ స్వీట్‌ వార్నింగ్‌ ఇచ్చింది. ఇక కెప్టెన్‌ అయిన ఆనందంలో హారిక మైక్‌ ధరించకుండానే హౌస్‌ అంతా తిరుగుతోంది. దీంతో హారిక నువ్వు మైక్‌ ధరించు అని బిగ్‌బాస్‌ చెప్పడంతో పరుగో పరుగున వెళ్లిన మైక్‌ ధరించింది. దీంతో కెప్టెన్‌ ఇంటి నియమాలు పాటించడం లేదని హారికను ఆటపట్టించారు. అందుకు శిక్షగా హారికతో పాటు ఇంటి సభ్యులు స్టెప్పులు వేస్తూ బిగ్‌బాస్‌కు క్షమాపణ చెప్పారు.

Next Story