హౌస్‌లో ఏమైంది..?.. ఏడుపులతో దద్దరిల్లిపోయిన బిగ్‌బాస్‌ హౌస్‌

Bigg boss4: Mehaboob elimination .. బిగ్‌బాస్‌ షో.. ఇది తెలుగులో ఎంతో పాపులారిటీ పొందింది. మొదటి

By సుభాష్  Published on  16 Nov 2020 7:42 AM IST
హౌస్‌లో ఏమైంది..?.. ఏడుపులతో దద్దరిల్లిపోయిన బిగ్‌బాస్‌ హౌస్‌

బిగ్‌బాస్‌ షో.. ఇది తెలుగులో ఎంతో పాపులారిటీ పొందింది. మొదటి మూడు సీజన్లు విజయవంతంగా ముగించుకుని ఇప్పుడు నాలుగో సీజన్‌లో పదో వారం కొనసాగుతోంది. అయితే ప్రతివారం ఎలిమినేషన్ అనేది కొనసాగే ప్రక్రియ. ఇందులో భాగంగా ఈ వారం బిగ్‌బాస్‌ హౌస్‌ నుంచి మెహబూబ్‌ ఎలిమినేట్‌ అయ్యాడు. అందరూ ఊహించినట్లుగానే ఈ వారం అతడు ఇంటి నుంచి వెళ్లిపోయాడు. నామినేషన్లో ఉన్నవారందరిలో మెహబూబ్‌కు తక్కువ ఓట్లు రావడంతో అతడు ఎలిమినేట్‌ అయ్యాడు. మెహబూబ్‌ ఇంటి నుంచి వెళ్లిపోతున్న సమయంలో ఇంటి సభ్యులందరూ కన్నీటి పర్యంతమయ్యారు. అతనితో చనువుగా ఉండే మిత్రుడైన సోహెల్‌ చిన్న పిల్లాడిలా వెక్కి వెక్కి ఏడ్చాడు. మరో మిత్రుడు అఖిల్‌ సైతం కంటతడిపెట్టుకున్నాడు. మెహబూబ్‌ ఎలిమినేట్‌ అవుతాడని అస్సలు అనుకోలేదని, అతడిని విడిచి ఉండలేమని బోరున విలపించారు. ఎంతో ఉత్సాహంగా, హడావుడిగా ఉండే హౌస్‌ ఒక్కసారిగా ఏడుపులతో దద్దరిల్లిపోయింది.

అటూ ఎలిమినేట్‌ అయిన మెహబూబ్‌ సైతం విలపించాడు. స్టేజీపైకి వచ్చిన తర్వాత అటూ మెహబూబ్‌, ఇటు సోహెల్ ఏడుపులతో హౌస్‌ అంతా బాధకరంగా మారిపోయింది. ఇప్పటి వరకు జరిగిన మూడు సీజన్లతో పాటు ఇప్పుడు జరిగే నాలుగో సీజన్‌లో ఇంతగా ఏడ్చింది ఎవ్వరు కూడా లేరు. మెహబూబ్‌ గానీ, సోహెల్‌ గానీ, అఖిల్‌ గానీ, అవినాష్‌ గానీ వారి ఏడుపులను చూస్తుంటే స్నేహమంటే ఏంటో చూపించారు. స్నేహానికి ఉన్న ఉన్న ప్రాధాన్యత తెలిసిందే.

మిగతా సభ్యులు కూడా మెహబూబ్‌ ఎలిమినేషన్‌ను జీర్ణించుకోలేకపోయారు. ప్రతి టాస్కులు ముందుండి గట్టిపోటీ ఇచ్చిన మెహబూబ్‌.. ఎంతో యాక్టవ్‌గా ఉండేవాడు. ఇంక ఇంట్లో వారంతా తనను ఎంతో బాగా చూసుకున్నారని చెప్పాడు. బిగ్‌బాస్‌ ఇంట్లోకి వచ్చిన తర్వాతే తాను స్విమ్మింగ్ నేర్చుకున్నానని, సోహెల్‌ మాత్రమే కాదు అందరితోనూ తనకు అనుబంధం ఎంతో ఉందని విలపించాడు.

అవినాష్ పై బిగ్‌బాంబ్‌

ఇక ప్రతివారం ఇంటి సభ్యుడు ఎలిమినేట్‌ అవుతున్న సమయంలో ఇంటి సభ్యుల్లో ఏదో ఒక సభ్యునిపై బిగ్‌ బాంబు వేయడం ప్రతివారం జరిగేదే. ఈ వారం బిగ్‌ బాంబ్ వేయాలని నాగార్జున అడుగగా, అందుకు మెహబూబ్‌ అవినాష్ పై వేశాడు. ఈ మేరకు అవినాష్ వారమంతా నాన్‌వేజ్‌ తినకూడదు. రేషన్‌ మేనేజర్‌గా ఉన్న అవినాష్‌కు ఈ బిగ్‌ బాంబ్‌ పడింది. అయితే ఈ బిగ్‌ బాంబ్‌ను మెహబూబ్‌ వేయకముందే తనపై వేయాలని అవినాష్‌ ముందుగానే కోరాడు. సరేనంటూ మెహబూబ్‌ సైతం అవినాష్ పై ఈ బాంబ్‌ వేశాడు. అయితే రెండు వారాల పాటు ఉండే ఈ బిగ్‌బాంబ్‌.. ఒక వారానికి కుదించారు హోస్ట్‌ నాగార్జున. ఏది ఏమైనా ఈ వారంలో హౌస్‌ మొత్తం ఏడుపులతో ఎలిమినేట్‌ దద్దరిల్లిపోయింది.

Next Story