బిగ్‌బాస్‌: నాగార్జునపై అభిజిత్ అభిమానుల ఫైర్‌.. సోషల్‌ మీడియాలో ట్రోలింగ్‌

Bigg boss show- Social media trolling Nagarjuna .. బిగ్‌బాస్‌ షో తుది దశకు చేరుకుంది. మరో మూడు వారాల్లో గ్రాండ్ ఫినాలే

By సుభాష్  Published on  30 Nov 2020 8:56 AM IST
బిగ్‌బాస్‌: నాగార్జునపై అభిజిత్ అభిమానుల ఫైర్‌.. సోషల్‌ మీడియాలో ట్రోలింగ్‌

బిగ్‌బాస్‌ షో తుది దశకు చేరుకుంది. మరో మూడు వారాల్లో గ్రాండ్ ఫినాలే జరగనుంది. అయితే కంటెస్టెంట్లు సరిగా ఆట ఆడటం లేదని చెబుతున్న నాగార్జున తాజాగా శనివారం జరిగిన షోలో హారికను కన్ఫెషన్‌ రూమ్‌కు పిలిపించి నువ్వు బెస్ట్‌ కెప్టెన్‌ కాదని చెప్పాడు. ఆ వారంలో ఆమె చేసిన తప్పులన్ని వీడియో రూపంలో చూపించి మరీ క్లాప్‌ పీకారు. మోనాల్‌ వల్ల కెప్టెన్‌ అయిన నువ్వు అభిజిత్‌ కోసం పని చేశావని నాగార్జున నిందించారు. అభి మీద ఫేవరెటిజమ్‌ చూపించావని విమర్శించారు. ఇక హారిక విషయం అటుంచితే తర్వాత అభిజిత్‌ మీద పడ్డాడు. బిగ్‌బాస్‌ ఇచ్చిన టాస్కులు సరిగా చేయడం లేదంటూ మండిపడ్డారు. బిగ్‌బాస్ హౌస్‌ మెయిన్‌ గేట్లు ఎత్తి బయటకు పంపిస్తానని అభిని బెదిరించాడు. దీంతో అభి ఎమోషన్‌ అయి మెకాళ్లపై నిలబడి తన తప్పును క్షమించమని వేడుకున్నాడు. తప్పును ఒప్పుకొన్నావు కనుక హౌస్‌లో ఉంచుతున్నాను.. లేకపోతే ఈ రోజు బయటకు పంపించేవాణ్ని అంటూ చెప్పుకొచ్చాడు నాగ్‌.

నాగార్జున సినిమాలను అట్టర్‌ ఫ్లాప్‌ చేస్తాం

దీనిపై అభిజిత్‌ అభిమానులు నాగ్‌పై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. అసలు ఫేవరెటిజమ్‌ చూపించేది నాగార్జునే అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. ఆయన కళ్లకు ఎవరి తప్పులు కనిపించడం లేదా... అంటూ నాగ్‌ను కడిగిపారేశారు నెటిజన్లు. ఆయన నటించిన వైల్డ్‌ డాగ్‌ సినిమాను అట్టర్‌ ఫ్లాప్‌ చేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ ట్రోలింగ్‌ చూసిన నాగ్‌ అభిమానులు మండిపడుతున్నారు. ఓ మామూలు కంటెస్టెంట్‌ కోసం స్థార్‌ నాగార్జునను అనే మాటలా..?అని గరమవుతున్నారు.

అప్పుడు నాని... ఇప్పుడు నాగార్జున

కాగా, గత బిగ్‌బాస్‌ రెండో సీజన్‌లో కూడా ఇలాంటిదే జరిగింది. అప్పుడు హోస్ట్‌గా చేసిన నానిపై కూడా ఇలాంటి ట్రోలింగ్‌ జరిగింది. రెండు సీజన్‌లో కౌశల్‌పై నాని టార్గెట్‌ చేసినప్పుడు కౌశల్‌ అభిమానులు ఈ విధంగానే సోషల్‌ మీడియా వేదిక మండిపడ్డారు. సోషల్‌ మీడియాలో కౌశల్‌ అభిమానుల ట్రోలింగ్‌ తట్టుకోలేక ఈ సీజన్‌కు హోస్టింగ్‌ చేయనని ఖరాఖండిగా చెప్పేశారు నాని. అప్పుడు నానిపై ట్రోలింగ్‌ జరిగినట్లే ఇప్పుడు నాగ్‌పై అదే జరిగింది. నిజానికి నాగార్జున కంటెస్టెంట్ల తప్పులను ఎత్తి చూపి వారిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఈ వారంలో ఎవరైతే దిద్దుకోలేని తప్పులు చేశారో వాటిని ప్రస్తావిస్తూ ఆ తప్పులు మళ్లీ జరుగకుండా చూసుకోమని సలహా ఇచ్చారు. హౌస్‌లో తప్పులు చేసే ఇతర కంటెస్టెంట్లను కూకుండా హారిక, అభిజిత్‌లను క్లాస్‌ పీకడంతో నెటిజన్లు ఫైర్‌ అయ్యారు. అయితే నాగార్జున తమ మంచి కోరే చెప్పారన్న విషయం హారిక, అభిజిత్‌లకు అర్థమైంది. ఇక అభిపై నాగ్‌ ఇలా కోపగించుకోవడంతో అభిమానులు తట్టుకోలేక సోషల్‌ మీడియా వేదిక నాగ్‌పై మండిపడుతున్నారు. ఈ సీజన్‌లో అభి కోసం ఏకంగా నాగార్జునపై ట్రోలింగ్‌ చేస్తున్నారు. మరీ ఈ పరిణామాలు ఎటు దారి తీస్తాయో చూడాలి.

Next Story