వెండితెరపై హీరోగా అమర్‌దీప్ ఎంట్రీ.. హీరోయిన్‌గా ఎవరంటే..
బిగ్‌బాస్‌షోలో పాల్గొని బయటకు వచ్చాక సినిమా ఆఫర్లతో పాటు వివిధ రకాలుగా లబ్ధి పొందినవారు చాలా మంది ఉన్నారు.
By Srikanth Gundamalla Published on 1 Feb 2024 6:22 PM ISTవెండితెరపై హీరోగా అమర్‌దీప్ ఎంట్రీ.. హీరోయిన్‌గా ఎవరంటే..
బిగ్‌బాస్‌షోలో పాల్గొని బయటకు వచ్చాక సినిమా ఆఫర్లతో పాటు వివిధ రకాలుగా లబ్ధి పొందినవారు చాలా మంది ఉన్నారు. సోహెల్, అభిజిత్, దివి, స్రవంతి ఇలా చాలా మంది ఆ హౌస్ నుంచి బయటకు వచ్చి కెరీర్‌లో ఫుల్ బిజీ అయ్యారు. ఇటీవల తెలుగు బిగ్‌బాస్ సీజన్-7లో రన్నరప్‌గా నిలిచిన అమర్‌దీప్ ప్రతి ఒక్కరికీ తెలిసే ఉంటాడు. అతను గతంలో సీరియల్స్‌లో నటించడంతో పాటు.. పలు టీవీ షోల ద్వారా పరిచయస్తుడే. అయితే.. అతను తాజాగా వెండితెరకు పరిచయం అవుతున్నాడు.
అమర్‌దీప్ సీరియల్స్ చేస్తూ.. పలు షోల్లో పాల్గొన్నాడు. నటన ద్వారా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు వెండితెరపై హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. దీనికి సంబంధించి షూటింగ్ కూడా ప్రారంభం అయ్యింది. అయితే.. ఈ మూవీలో కొత్త హీరోయిన్‌ను తీసుకున్నారు. ఆవిడ కూడా అందరికీ బాగా తెలిసిన వ్యక్తే. సోషల్ మీడియాలో ఈమెకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. సురేఖ వాణి కూతురు సుప్రితా నాయుడు హీరోయిన్‌గా పరిచయం అవుతున్నారు.
ఇంతకు ముందు సుప్రిత నాయుడు ఒక షార్ట్ ఫిలింలో మాత్రమే నటించింది. ఇప్పుడు ఏకంగా హీరోయిన్‌గా వెండితెరపై కనిపించబోతుంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే సుప్రిత.. అందులో స్టార్‌గా ఎదిగింది. ఎంతో మంది అభిమానులను. ఫాలోవర్లను సొంతం చేసుకుంది. రీల్స్.. వీడియోలు.. ఫొటో షూట్లు చేస్తూ అభిమానులకు దగ్గరగా ఉంటుంది. అమర్‌దీప్‌తో వెండితెరపై తాజాగా హీరోయిన్‌గా అవకాశం రావడంతో ఆమె సంతోషం వ్యక్తం చేస్తోంది. ఇక ఈ మూవీలో సీనియర్ నటుడు వినోద్ కుమార్, రాజా రవీంద్ర, ఎస్తర్‌లు కూడా నటిస్తున్నారు.