ఇలా అయితే షో నుంచి తప్పుకుంటా.. బిగ్‌బాస్‌ టీమ్‌కు నాగార్జున వార్నింగ్‌..!

Bigg boss Nagarjuna's warning .. బిగ్‌బాస్‌ నాలుగో సీజన్‌ కొనసాగుతోంది. గతంలో లాగానే ఈ సీజన్‌లో కూడా షోకు సంబంధించిన

By సుభాష్  Published on  24 Nov 2020 3:07 AM GMT
ఇలా అయితే షో నుంచి తప్పుకుంటా.. బిగ్‌బాస్‌ టీమ్‌కు నాగార్జున వార్నింగ్‌..!

బిగ్‌బాస్‌ నాలుగో సీజన్‌ కొనసాగుతోంది. గతంలో లాగానే ఈ సీజన్‌లో కూడా షోకు సంబంధించిన లీకులు వస్తూనే ఉన్నాయి. అయితే షోను ఒక రోజు ముందుగా చిత్రీకరించి మరుసటి రోజు ప్రసారం చేస్తారు. అలాగే ప్రతి వారం ఎవరు ఎలిమినేట్‌ అవుతున్నారు అనే విషయం ముందుగానే బయటకు పొక్కిపోతుంది. షోకు సంబంధించి ఎలాంటి లీకులు బయటకు రాకుండా బిగ్‌బాస్‌ నిర్వాహకులు ఎన్ని చర్యలు చేపట్టినా.. ఏ మాత్రం ఆగడం లేదు. ఎవరు ఎలిమినేట్‌ అవుతున్నారు.. వైల్డ్‌ కార్డు ఎంట్రీ ఇచ్చేది ఎవరు.. ఇలా ప్రతి విషయం కూడా లీకై నెట్టింట్లో హల్‌ చల్‌ చేస్తున్నాయి. షో ప్రారంభం కాకముందే ఎలిమినేట్‌ అయ్యే కంటెస్టెంట్‌ ఎవరనేది ముందుగా తెలిసిపోతుంది.

ఇక ఇదే విషయంపై హోస్ట్‌ నాగార్జున బిగ్‌బాస్‌ టీమ్‌పై మండిపడ్డారని తెలుస్తోంది. సీక్రెట్‌ రూమ్‌, ఎలిమినేషన్‌ సహా అన్ని ఎపిసోడ్‌లు ప్రసారం కావడానికి ముందు లీక్‌ కావడంపై నాగ్‌ తీవ్ర అసహనం వ్యక్తం చేశారట. ఇలా అయితే ఇకపై హోస్టింగ్‌ చేయనని తేల్చి చెప్పినట్లు తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది. లీకులకు చెక్‌ పెట్టేందుకు చర్యలు తీసుకోకపోతే తాను షో నుంచి తప్పుకోవడానికి ఏ మాత్రం వెనుకాడనని తేల్చి చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే షోను నడిపించడంలో వ్యాఖ్యాతది ప్రత్యేక పాత్ర అనే చెప్పాలి. షో రేటింగ్‌ రావడంలో హోస్టింగ్‌ పాత్ర కీలకం. అందులో ఈ సీజన్‌ మొదటి ఎపిసోడ్‌ 18కిపైగా తీసుకొచ్చిన నాగార్జున వంటి హీరోలను సైతం వదులుకోవడానికి బిగ్‌బాస్‌ నిర్వాహకులు అంగీకరించరు. నాగ్‌ చెప్పినట్లు లీకులు కాకుండా చర్యలు తీసుకోక తప్పదు మరి. అయితే మొదటి సీజన్‌ వేరే రాష్ట్రంలో నిర్వహించిన సమయంలో ఎలాంటి లీకులు బయటకు వచ్చేది కాదు. ఎందుకంటే అక్కడ తెలుగువారు ఉండరు. ఎవరైన ఎలిమినేట్‌ అయితే ఇక్కడికి రావడానికి ఒక రోజు సమయం పట్టేది. అక్కడి నుంచి ఇక్కడి వారికి లీకులు ఇచ్చే వారు ఎవ్వరు ఉండేది కాదు. ఇక తర్వాత సీజన్‌ నుంచి ఈ సీజన్‌ వరకు హైదరాబాద్‌లోనే కొనసాగుతుంది. దీంతో అప్పటి నుంచి లీకులు అవుతూనే ఉన్నాయి. గత సీజన్‌లో కూడా ప్రతి ఎసిసోడ్‌కు సంబంధించి ప్రతిది బయటకు వచ్చేది. ఈ సీజన్‌లో కూడా మొదటి నుంచి కూడా లీకులు అవుతూనే ఉన్నాయి. ఇక తాజాగా కొనసాగుతున్న నాలుగో సీజన్‌ ముగింపు దశకు వచ్చింది. ఇప్పుడు తాజాగా నాగ్‌ వార్నింగ్‌తో బిగ్‌బాస్‌ టీమ్‌ ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.

Next Story