బిగ్‌బాస్‌లో దెయ్యం వాయిస్ ఆమెదేనా..?
Bigg boss Ghost voice .. తెలుగులో ప్రసారమవుతున్న బిగ్‌బాస్ షో ఎంతో పాపులారిటీ పొందుతోంది. ప్రస్తుతం నాలుగో సీజన్‌లో
By సుభాష్ Published on 26 Nov 2020 6:25 PM ISTతెలుగులో ప్రసారమవుతున్న బిగ్‌బాస్ షో ఎంతో పాపులారిటీ పొందుతోంది. ప్రస్తుతం నాలుగో సీజన్‌లో కొనసాగుతోంది. ఈ తెలుగులో ప్రసారమయ్యే షోకు మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే తుది దశకు చేరుకున్న ఈ షోకు మరింత హైప్ తీసుకువచ్చేందుకు బాగ్‌బాస్ నిర్వాహకులు ఓ దెయ్యాన్ని తీసుకువచ్చింది. దాని ఎంట్రీ తర్వాత గెటప్ వేసిన ఆమె ఎవరు.. ? వాయిస్ ఎవరిది..? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా ఈ వాయిస్ ఎవరిదంటూ సోషల్ మీడియాలో మీడియాలో రకరకాలు వ్యక్త పరుస్తున్నారు. అయితే బిగ్‌బాస్ షో ముగింపు దగ్గర పడుతున్నకొద్ది మరింత ఆసక్తి రేపుతోంది. ఈ వారం ప్రీ ఎవిక్షన్ పాస్ అనే కొత్త పద్దతిని ప్రవేశపెట్టాడు బిగ్‌బాస్. దాని ప్రకారం నామినేట్ అయినవారిలో ఒకరికి ఓ వారం ఎలిమినేట్ నుంచి ఇమ్యూనిటీ లభిస్తుంది. దీనిని అవినాష్ గెలుచుకున్న విషయం తెలిసిందే.
దెయ్యం ఎంట్రీతో మరింత ఆసక్తి
ముగింపు దశకు చేరువువుతన్న బిగ్‌బాస్ షోకు మరింత రేటింగ్ కోసం నిర్వాహకులు సరికొత్త ప్రయోగాలను చేస్తున్నారు. హౌస్‌లోకి దెయ్యాన్ని తీసుకువచ్చారు. దీనిని ముందుగా చూసిన అరియానా ఒక్కసారిగా భయపడి ఏడ్చింది. భయంతో గజగజ వణికిపోయింది. దీంతో హౌస్ కంటెస్టుంట్ల సైతం ఏమైందోనని హడావుడికి గురయ్యారు.
అయితే తన పేరు జలజా అంటూ దెయ్యం వాయిస్ ఇచ్చింది. కాగా, బుధవారం రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్‌కు సంబంధించి ప్రోమోలు వదిలింది బిగ్‌బాస్. దీంతో ఆ దెయ్యం అందరి కంటపడింది. అది చూసిన వెంటనే పలానా వ్యక్తి అంటే.. పలానా వ్యక్తి అని సోషల్ మీడియాలో ఎవరికి తోచిన విధంగా వారు చెప్పుకొంటున్నారు. ఈ క్రమంలో నటి హరితేజ అ పేరు అని హట్‌టాపిక్‌గా మారింది. అయితే దీనిపై స్పందించిన హరితేజ తాను దెయ్యం కాదని క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
వాయిస్ ఎవరిదో చెప్పిన అవినాష్
అయితే ఈ సీజన్‌లో ఉన్న కంటెస్టెంట్లు ఏ విషయంలోనైనా కాస్త ముందుగానే ఊహించగల్గుతున్నారు. ఈ క్రమంలో తాజాగా ఎంట్రీ ఇచ్చిన దెయ్యం గురించి తమకు తెచినట్లుగా మాట్లాడుకుంటున్నారు. ఈ వాయిస్ ఆర్జే సునీత గారిదేనంటూ అవినాష్ పదేపదే చెప్పాడు.
తాజా సమాచారం ప్రకారం.. బిగ్‌బాస్ హౌస్‌లో దెయ్యానికి వాయిస్ ఇచ్చింది బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్ సింగర్ గీతామాధురి అని తెలుస్తోంది. ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. బిగ్‌బాస్ రెండో సీజన్‌లో పాల్గొన్న గీతామాధురి ఫైనల్ వరకు వెళ్లిన విషయం తెలిసిందే. ఇద్దరిలో కౌశల్ మండా విన్నర్ కాగా, ఆమె రన్నరప్‌గా ట్రోఫీతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.