క్షమాపణలు చెప్పిన బిగ్ బాస్ బ్యూటీ

తిరుమల శ్రీవారి భక్తులకు, టీటీడీకి బిగ్ బాస్ ఫేమ్ ప్రియాంకా జైన్, ఆమె బాయ్ ఫ్రెండ్ శివకుమార్ క్షమాపణలు చెప్పారు.

By Kalasani Durgapraveen  Published on  3 Dec 2024 8:30 AM GMT
క్షమాపణలు చెప్పిన బిగ్ బాస్ బ్యూటీ

తిరుమల శ్రీవారి భక్తులకు, టీటీడీకి బిగ్ బాస్ ఫేమ్ ప్రియాంకా జైన్, ఆమె బాయ్ ఫ్రెండ్ శివకుమార్ క్షమాపణలు చెప్పారు. తిరుమల నడక మార్గంలో వీరు చేసిన వీడియోపై తీవ్ర విమర్శలు రావడంతో క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. శివకుమార్ తో కలిసి ప్రియాంక తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లారు. అలిపిరి మెట్ల మార్గంలో చిరుత సంచరించే ఏడో మైలురాయి నుంచి లక్ష్మీనరసింహస్వామి ఆలయం మధ్యలో వీరిద్దరూ రీల్స్ చేశారు. చిరుత వచ్చిందంటూ పరుగులు తీశారు. ఆ తర్వాత చిరుత లేదని, సరదాగా వీడియో చేశామని చెప్పారు.

దీనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. వెంటనే క్షమాపణలు చెబుతూ వీడియో చేశారు ప్రియాంకా జైన్, శివకుమార్. తాము చేసిన ఒక బ్లాగ్ శ్రీవారి భక్తులను హర్ట్ చేస్తుందని ఊహించలేద.ని, ఎంటర్టైన్మెంట్ కోసం చేసిన ఈ వీడియో ఇలా మారుతుందని అస్సలు అనుకోలేదన్నారు. ఈ వీడియో వల్ల ఇంతమంది హర్ట్ అవుతారనే విషయం తెలిస్తే చేసేవాళ్ళం కాదని, మేము తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టను దిగజార్చాలని అనుకోలేదని, ఇలా జరుగుతుందని కలలో కూడా ఊహించలేదన్నారు. భక్తులలో భయం కలగడానికి ఆ వీడియో చేయలేదని, తామిద్దరం శ్రీ వెంకటేశ్వర స్వామికి పరమ భక్తులమన్నారు.

Next Story