సోహెల్‌కు షాక్‌ల మీద షాక్‌లు.. అతన్ని ఓదార్చడం ఎవరి తరం కాలేదు

Bigg boss -4 Mehboob Elimination.. sohel Crying.. బిగ్‌బాస్‌లో ఆదివారం రాత్రి జరిగిన ఎలిమినేషన్‌ ప్రక్రియలో

By సుభాష్  Published on  16 Nov 2020 3:33 AM GMT
సోహెల్‌కు షాక్‌ల మీద షాక్‌లు.. అతన్ని ఓదార్చడం ఎవరి తరం కాలేదు

బిగ్‌బాస్‌లో ఆదివారం రాత్రి జరిగిన ఎలిమినేషన్‌ ప్రక్రియలో హౌస్‌ అంతా కూడా ఏడుపులతో ముగిసింది. స్నేహమంటే ప్రాణమిస్తా అన్న డైలాక్‌కు ఇది నిదర్శనమనే చెప్పాలి. ప్రతి ఒక్కరు కూడా స్నేహం చేస్తుంటారు. కానీ స్నేహమంటే ప్రాణమిచ్చే వాళ్లు కొందరుంటారు. స్నేహమంటే తన ప్రాణమని భావించే వ్యక్తి అంటే సోహెల్‌. అతనికి బిగ్‌బాస్‌ షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్నాడు. అఖిల్‌ ఎలిమినేట్‌ అయ్యాడంటూ నిన్నటి నిన్నటి మొన్నటి వరకు ఏడిపించిన బిగ్‌బాస్‌.. ఇప్పుడు మరో మిత్రుడు మెహబూబ్‌ ఎలిమినేట్‌ అవుతుంటే సోహెల్‌ తట్టుకోలేకపోయాడు. ఈ వారం జరిగిన ఎలిమినేషన్‌లో మెహబూబ్‌ ఎలిమినేట్‌ కావడంతో సోహెల్‌ తట్టుకోలేకపోయాడు. హౌస్‌లో ఆయన ఏడుపుతో దద్దరిల్లిపోయింది. సోహెల్‌ ఏడుపును ఆపడం ఎవరి తరం కాలేదు.

ఇంతకు ముందు సీజన్లో ఎలిమినేషన్‌ జరిగినప్పుడు మిగతా ఇంటి సభ్యులు ఏడుస్తుంటే ఓవరాక్షన్‌ ఏందని, ఇదంతా ప్రేక్షకుల ఓట్లు కొట్టేయడానికేనంటూ ఎగతాళి చేసేవాళ్లం. నిజంగా ఆ ఎమోషన్స్‌ అంటే ఏంటో తెలుస్తాయి అంటూ సోహెల్‌ కన్నీళ్లు పెట్టుకున్నాడు. బ్రెయిన్‌.. మనసు ఈ రెండింటితో కొట్లాడాలని బోరున ఏడ్చేశాడు. ఆదివారం జరిగిన బిగ్‌బాస్‌ షో చూస్తే ప్రేక్షకుల్లో సైతం బాధ కలిగించింది. అటు హారిక, మోనాల్‌, అఖిల్‌, అవినాష్‌లు కూడా మెహబూబ్‌ వెళ్లిపోతుంటే ఏడ్చేశారు. అయితే సోహెల్‌ ఏడుపు డ్రామా కాదని, వాళ్ల ఫీలింగ్స్‌ను ఎగతాళి చేయకండి అంటూ పలువురు సూచిస్తున్నారు. నిజమైన స్నేహం అంటే ఏమిటో తెలిసిందని అంటున్నారు.

సోహెల్‌ ఏడుస్తుంటే మాకు దుఃఖం తన్నుకొస్తుంది

కాగా, మెహబూబ్‌ ఎలిమినేట్‌ అయి వెళ్తుంటే సోహెల్‌ ఏడుస్తుంటే మాకు తెలియకుండానే దుఃఖం తన్నుకొస్తుందని ఆయన అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇక మెహబూబ్‌ తన టాస్కులో సైతం వెనక్కి తగ్గకుండా పూర్తి చేసిన విషయం తెలిసిందే. అయితే మెహబూబ్‌ ప్రారంభ ఏపిసోడ్‌లో దెబ్బ తీశాయన్న విషయం తెలిసిందే. ఈ వారం ప్రేక్షకులను ఆకర్షించలేకపోయాడు.

Next Story