బిగ్‌బాస్‌ హౌస్‌లో అఖిల్‌-మోనాల్‌ ముద్దులు.. జనాలు షాక్‌

Bigg boss 4.. Akhil and Monal Kiss.. బిగ్‌బాస్‌ 4 విజయవంతంగా కొనసాగుతోంది. మొదట్లో రేటింగ్‌ తక్కువగా ఉన్నా..

By సుభాష్  Published on  18 Nov 2020 6:22 PM IST
బిగ్‌బాస్‌ హౌస్‌లో అఖిల్‌-మోనాల్‌ ముద్దులు.. జనాలు షాక్‌

బిగ్‌బాస్‌ 4 విజయవంతంగా కొనసాగుతోంది. మొదట్లో రేటింగ్‌ తక్కువగా ఉన్నా.. మళ్లీ రేటింగ్‌ పెరిగేలా ప్లాన్‌ చేసింది బిగ్‌బాస్‌. అయితే ప్రతివారంలో రెండు రోజులు వచ్చే నాగార్జున... మీ ఇంటితో పాటు మా ఇంటిపై కూడా ఓ కన్నెసి ఉంచండి అని చెప్పి వెళ్లిపోతాడు. అలా కన్నెసి ఉంచినప్పుడు హౌస్‌లో రొమాన్స్‌ లాంటివి చూడాల్సి వస్తోంది. అప్పుడప్పుడు హద్దులు మీరిన రొమాన్స్‌ కూడా కనిపిస్తోంది. ఇక హౌస్‌లో అందరికంటే ముందుగా చెప్పుకోవాల్సిన కంటెస్టెంట్ అంటే అఖిల్‌, మోనాల్‌. ఈ జంట సీజన్‌ మొదట్లోనే ఎంతో కనెక్టు అయిపోయారు. ముందు నుంచి ఒకరు విడిచి ఒకరు ఉండరన్నట్లుగా మారిపోయింది. అప్పుడప్పుడు వాళ్ల రొమాన్స్‌ కూడా బాగానే ఉంటాయి. హౌస్‌లోనే కాదు.. చూసే ప్రేక్షకులకు కూడా తెలుసు వీరి మధ్య ఏం జరుగుతుందో. హౌస్‌లో ఇద్దరు క్లోజ్‌గా ఉండే వీరు.. కాస్త లైన్‌ దాటినట్లు కనిపిస్తోంది. కొన్నిసార్లు అదిరిపోయే ఎమోషన్స్‌ నిజంగానే ఇది ఫ్యామిలీ షో అన్నట్లు అనిపిస్తుంది.

కాని కొన్నిసార్లు మాత్రం వీళ్లేందిరా బాబూ అన్నట్లు ఉంటుంది. కొన్ని కొన్ని సార్లు ఫ్యామిలీతో కలిసి చూడాలా.. వద్దా అన్నట్లు ఉంటుంది. అలాంటిదే ఇప్పుడు జరిగింది. అసలు విషయానికొస్తే.. నవంబర్‌ 17న అఖిల్‌ బర్త్‌డే. దీంతో అందరూ కలిసి కేక్ కట్‌ చేయించారు. అంతా బాగానే ఉన్నా.. అఖిల్‌ బర్త్‌డే రోజు మోనాల్‌ మాత్రం ఆయనకు మర్చిపోలేని గిఫ్ట్‌ ఇచ్చింది. అఖిల్‌ను గట్టిగా పట్టుకుని ముద్దుల వర్షం కురిపించింది. ఇందుకు అఖిల్‌ కూడా షాక్ అయ్యాడు. ఫస్ట్‌ టైమ్‌ ఇచ్చావు కదా నాకు ముద్దులు అంటూ అనేశాడు అఖిల్. ఇలా చేస్తానంటే నాకు రోజూ బర్త్‌ డే వచ్చుంటే బాగుండు అనిపిస్తుందని అనేశాడు. వెంటనే మోనాల్‌ సిగ్గు పడుతూ సమాధానం ఇచ్చింది. బర్త్‌డే గిఫ్ట్‌ తీస్కో.. పండగ చేస్కో అనేసింది. ఈ ఇద్దరి రొమాన్స్‌ మాత్రం కాస్త మితిమీరినట్లే కనిపించింది.

Next Story