బిగ్‌బాస్‌లో తీవ్ర భావోద్వేగానికి గురైన అభిజిత్.. ఎందుకంటే
Bigg boss 4 abhijeet emotional .. బిగ్‌బాస్ నాలుగో సీజన్ కొనసాగుతోంది. ముందుగా షోకు పెద్దగా రేటింగ్ లేకపోయినా..
By సుభాష్ Published on 26 Nov 2020 10:41 AM ISTబిగ్‌బాస్ నాలుగో సీజన్ కొనసాగుతోంది. ముందుగా షోకు పెద్దగా రేటింగ్ లేకపోయినా.. తర్వాత మెల్లమెల్లగా పుంచుకుంది. అయితే బిగ్‌బాస్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా కన్నీల్లు పెట్టని అభిజిత్ బుధవారం నాటి ఎపిసోడ్‌లో చాలా ఎమెషన్‌కు గురయ్యాడు. అభిజిత్, అఖిల్ మోనాల్‌లను బాగా ఏడిపించారని, అందులో వీరిద్దరిలో ఒకరు ఆమెతో డేట్‌కి వెళ్లాలని బిగ్‌బాస్ సూచించాడు. దాని కోసం ఓ క్విజ్ కాంపిటేషన్ కూడా పెడతామని, అందులో గెలిస్తేనే మోనాల్‌తో డేట్‌కి వెళ్తారని బిగ్‌బాస్ లేటర్ పంపాడు.
దీనిపై అభిజిత్ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యాడు. మోనాల్‌తో నాకు ఎలాంటి లింక్ పెట్టకండి అని చెబుతూనే ఉన్నా.. అయినా మల్లీ డేట్ ఏంటీ..?నేను తనను ఏడిపించడం ఏంటీ? నాకు ఈ టాస్క్ వద్దు. దీనికి నేను అంగీకరిస్తే ఆమెను ఏడిపించానని ఒప్పుకొన్నట్లే. అసలు మోనాల్ టాపిక్ నా దగ్గరకు రాకూడదు అనుకున్నా. మేం ఇద్దరం కలిసి మోనాల్‌ను ఏడిపించడం ఏంటీ.? ఇదేదో బిగ్ డీల్‌లా కనిపిస్తోంది. నాకు ఎక్కడో కొడుతోంది బిగ్‌బాస్. నాకు మోనాల్ అభిజిత్ అన్న ప్రజెక్షన్ వద్దు. మోనాల్ టాపిక్ తీసుకురావద్దని అఖిల్‌తో చెప్పా. ఈ ప్రయాణం మొత్తం లో మోనాల్ టాపిక్ బిస్కట్ అవుతుంది. నేను మోనాల్‌తో డేట్‌కి వెళ్లలేను అంటూ చెప్పుకొచ్చాడు. ఈ టాస్క్ వద్దంటూ అభి ఎమోషనల్ అయ్యాడు. కాగా, లగ్జరీ బడ్జెట్‌లో భాగగా దీనిని చేయడం మీ బాధ్యత అంటూ బిగ్‌బాస్ చెప్పాడు. ఈ టాస్క్ నేను చేయలేనని అభి చెప్పడతో అఖిల్ టాస్కును కంప్లీట్ చేయాలని చెప్పాడు. చివరికి వచ్చిన అఖిల్ ఏమైంది బ్రదర్ ఎందుకు ఏడుస్తున్నావ్..అని అడగగా, మనమిద్దరం మోనాల్‌ను ఏడిపించామనే టాస్క్ నచ్చలేదు అని చెప్పుకొచ్చాడు.