'భోళా శంకర్' నుంచి మెగాస్టార్‌ చిరంజీవి మరో అప్‌డేట్

'భోళా శంకర్' మాస్‌ విశ్వరూపం ప్రదర్శించడం ఖాయమన్నారు మెగాస్టార్‌ చిరంజీవి.

By Srikanth Gundamalla  Published on  6 July 2023 7:31 PM IST
BholaShankar, Movie Update, Meaga Star Chiranjeevi,

'భోళా శంకర్' నుంచి మెగాస్టార్‌ చిరంజీవి మరో అప్‌డేట్

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా 'భోళా శంకర్‌' సినిమాలో నటిస్తున్నారు. దీనికి మెహర్ రమేశ్‌ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా నుంచి మెగాస్టార్‌ చిరంజీవి మరో అప్‌డేట్‌ ఇచ్చారు. సినిమా డబ్బింగ్‌ పనులు పూర్తయ్యాయని చెప్పారు. సినిమా బాగా వచ్చిందని.. తనకెంతో నచ్చిందటి ఈ సందర్భంగా చెప్పారు. డబ్బింగ్‌ చేస్తున్న ఫొటోలను ట్విట్టర్‌ ద్వారా పంచుకున్నారు మెగాస్టార్ చిరంజీవి.

'భోళా శంకర్' మాస్‌ విశ్వరూపం ప్రదర్శించడం ఖాయమన్నారు చిరంజీవి. ఆడియన్స్‌ను కచ్చితంగా ఆలరిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఆగస్టు 11న 'భోళా శంకర్' సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని.. రిలీజ్‌ డేట్‌ను రౌండప్‌ చేసుకోవాలని చిరంజీవి ట్వీట్‌ చేశారు. ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్‌గా చేసింది. చిరంజీవి చెల్లెలి పాత్రలో కీర్తి సురేశ్‌ చేస్తున్నారు. సుశాంత్‌ కీలక పాత్రలో కనిపిస్తారు. రఘుబాబు, మురళీశర్మ, రవిశంకర్, వెన్నెల కిశోర్, శ్రీముఖి, బిత్తిరి సత్తి, గెటప్‌ శ్రీను, రష్మీ గౌతమ్‌ తదితరులు ఈ సినిమాలో నటించారు.

ఏకే ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై రాంబ్రహ్మం సుంకర 'భోళా శంకర్' చిత్రాన్ని నిర్మించారు. మాస్‌ మెగా ఎంటర్‌టైనర్‌గా సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ చిత్రానికి మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తున్నారు.

Next Story