హిందీలో విడుదలకు సిద్ధం అవుతోన్న 'భోళా శంకర్'
మెగాస్టార్ చిరంజీవి 'భోళా శంకర్' హిందీలోనూ విడుదలకు సిద్ధం అవుతోంది.
By Srikanth Gundamalla Published on 15 Aug 2023 11:15 AM ISTహిందీలో విడుదలకు సిద్ధం అవుతోన్న 'భోళా శంకర్'
మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం 'భోళా శంకర్' ఇటీవల థియేటర్లలో విడుదల అయ్యింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ తెలుగులో మిక్స్‌డ్ టాక్‌నే సొంతం చేసుకుంది. మెహర్ రమేశ్ దర్శకత్వంలో రూపొందించిన 'భోళా శంకర్' హిందీలోనూ విడుదలకు సిద్ధం అవుతోంది.
తెలుగులో ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై విడుదలైన భోళాశంకర్ హిందీలో ఆర్కేడీ స్టూడియోస్ విడుదల చేయనుంది. ఆగస్టు 25 నుంచి హిందీలో బాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు వెళ్లనుంది. ఈ మేరకు చిరంజీవి సినిమా భోళాశంకర్ హిందీలో విడుదల అంటూ హిందీ వెర్షన్ టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇక హిందీలో మెగాస్టార్ చిరంజీవికి జాకీ ష్రాఫ్ డబ్బింగ్ చెప్పారు. అన్నా చెల్లెలు అనుంబంధాల కథతో ముడిపడి మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కింది ఈ సినిమా. చిరంజీవికి చెల్లిగా కీర్తి సురేశ్ నటించగా.. ఆయన హీరోయిన్‌గా తమన్నా కనిపించారు. వీరితో పాటు భోళాశంకర్ సినిమాలో సుశాంత్, తరుణ్ అరోడా, మురళీ శర్మ, షాయాజీ షిండ్ సహా తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
మెగాస్టార్ చిరంజీవి నటించడంతో సినిమాపై భారీ అంచనాలను పెట్టుకున్నారు అభిమానులు, ప్రేక్షకులు. అంతేకాక ప్రచార కార్యక్రమాలు కూడా ఓ రేంజ్‌లో ఉండటంతో హైప్ మరింత పెరిగింది. కానీ.. థియేటర్లలో సినిమా విడుదల అయ్యాక అంచనాలను అందుకోలేదంటూ ప్రేక్షకులతో పాటు అభిమానులు అభిప్రాయపడ్డారు. చిరంజీవి నటన, అక్కడక్కడా కొన్ని సన్నివేశాల్లో మెరుపులు తప్ప సినిమా మెప్పించలేదంటున్నారు. ఇక మెగస్టార్ చిరంజీవి త్వరలోనే మరో సినిమా తీయనున్ఆరు. 'గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్' పతాకంపై ఓ సినిమా చేయనున్నారు. అది కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకోనుంది.