ఓటీటీలోకి వచ్చేసిన 'భగవంత్ కేసరి'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే
దసరా సందర్భంగా విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన భగవంత్ కేసరి సినిమా ఓటీటీలోకి వచ్చేసింది.
By Srikanth Gundamalla Published on 24 Nov 2023 2:26 AM GMTఓటీటీలోకి వచ్చేసిన 'భగవంత్ కేసరి'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే
టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ వరుస సినిమాలు తీస్తూ.. విజయాలతో ఊపుమీద ఉన్నారు. ఇటీవల దసరా కానుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన భగవంత్ కేసరి సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. మంచి వసూళ్లను రాబట్టింది. యాక్షన్‌తో పాటు మెసేజ్ ఉన్న సినిమా కావడం.. అది కూడా బాలకృష్ణ సినిమా అవ్వడం ప్రేక్షకులను అలరించింది. దసరా సందర్భంగా థియేటర్లలో అలరించిన ఈ సినిమా.. ఇప్పుడు ఓటీటీ వేదికగా అందుబాటులోకి వచ్చింది. శుక్రవారం తెల్లవారుజాము నుంచే ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది.
థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయ్యిన వారు ఓటీటీలో వీక్షించేందుకు సిద్ధం అవుతున్నారు. కాగా.. భగవంత్ కేసరి సినిమాలో బాలకృష్ణ సరసన కాజల్ అగర్వాల్ నటించారు. స్టార్ హీరోయిన్ శ్రీలీల ఈ మూవీలో కీలక పాత్ర పోషించారు. కాగా.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ హిట్‌గా నిలిచింది. ఇక ఈ మూవీలో బాలీవుడ్ యాక్టర్ అర్జున్ రాంపాల్ విలన్‌గా కనిపించారు. ఆర్ శరత్‌కుమార్, రఘుబాబు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించారు. ఎస్ థమన్ సంగీతం అందించాడు.
అక్టోబర్ 19న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన భగవంత్ కేసరి సినిమా.. ఫస్ట్ డే నుంచి మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. 30 రోజులు పూర్తయ్యే సరికి వరల్డ్ వైడ్‌గా రూ.140 కోట్ల వసూళ్లు రాబట్టింది. దాంతో.. ఈ ఏడాది మొదటల్లో విడుదలైన బాలయ్య మరో సినిమా 'వీర సింహారెడ్డి' తర్వాత మరోసారి రూ.100 కోట్లకు పైగా వసూలు చేసిన బాలయ్య రెండో సినిమాగా భగవంత్ కేసరి నిలిచింది.