'భగవంత్ కేసరి', 'లియో' ఓటీటీల్లో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతాయంటే..
బాలకృష్ణ 'భగవంత్ కేసరి', విజయ్ 'లియో' సినిమాలు థియేటర్లలో ప్రేక్షకులను అలరిస్తున్నాయి.
By Srikanth Gundamalla Published on 19 Oct 2023 8:30 PM IST'భగవంత్ కేసరి', 'లియో' ఓటీటీలో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతాయంటే..
దసరా కానుకగా గురువారం రెండు పెద్ద సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. బాలకృష్ణ 'భగవంత్ కేసరి', విజయ్ 'లియో' సినిమాలు థియేటర్లలో ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఈ రెండు సినిమాలు కూడా మొదటి రోజే మంచి టాక్‌ను సొంతం చేసుకున్నాయి. రెండూ ఈ సినిమాలకు అవే బెస్ట్ అని చెబుతున్నారు. ఈ క్రమంలో భగవంత్ కేసరి, లియో సినిమాలు ఎక్కడ స్ట్రీమింగ్ అవుతాయనే విషయాలు తెలిసాయి.
విజయ్-లోకేష్ కనగరాజ్ కాంబోలో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ ‘లియో’ ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. పెద్ద హీరోల సినిమాలు నాలుగైదు వారాల తర్వాతే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతాయి. ఈ క్రమంలో లియో కూడా నాలుగైదు వారాల తర్వాతే నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవ్వనుంది. ఇందులో త్రిషతోఓ పాటు బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ప్రధాన పాత్రల్లో నటించారు.
ఇక అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వచ్చిన మూవీ 'భగవంత్ కేసరి'. ఈ మూవీ ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ మూవీ కూడా నాలుగైదు వారాల తర్వాతే ఓటీటీ వేదికగా అందుబాటులోకి వస్తుంది. బాలకృష్ణకు జోడిగా కాజల్ అగర్వాల్ నటించారు. పెళ్లి అయిన తర్వాత తొలిసారిగా ఆమె బిగ్‌స్క్రీన్‌పై కనిపిస్తున్నారు. అలాగే ఈ మూవీలో శ్రీలీల ప్రధాన పాత్రలో కనిపించారు. ఇక రవితేజ 'టైగర్ నాగేశ్వరరావు' సినిమాను కూడా ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. టైగర్ ష్రాఫ్ 'గణ్‌పథ్' రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. ఈ సినిమాలు అన్నీ థియేట్రికల్ రన్ పూర్తి చేసుకున్న తర్వాత ఆయా ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానున్నాయి.
మరోవైపు లియో సినిమాకు హీరో విజయ్ గురించి ఓ వార్త చర్చనీయాంశంగా మారింది. లియో సినిమాకు విజయ్ పారితోషికం రూ.120 కోట్లు తీసుకున్నారని టాక్ వినిపిస్తోంది. మొత్తం సినిమా బడ్జెట్ రూ.300 కోట్లు అవ్వగా దాంట్లో సగం పారితోషికం విజయ్‌కే వెళ్తున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.