నందమూరి బాలకృష్ణ టాక్ షో.. క్రేజీ పేరు వైరల్ అవుతోంది

Balakrishna to do talk show for Aha.నందమూరి బాలకృష్ణ ఆహా యాప్ కోసం ఒక టాక్ షో చేస్తున్నట్లు ఇటీవలే వార్త చక్కర్లు

By M.S.R  Published on  7 Oct 2021 7:15 PM IST
నందమూరి బాలకృష్ణ టాక్ షో.. క్రేజీ పేరు వైరల్ అవుతోంది

నందమూరి బాలకృష్ణ ఆహా యాప్ కోసం ఒక టాక్ షో చేస్తున్నట్లు ఇటీవలే వార్త చక్కర్లు కొడుతూ ఉంది. ఫ్యాన్స్ కే కాదు మొత్తం టాలీవుడ్ అభిమానులకు ఇదొక సూపర్ న్యూస్..! ఇక టాక్‌ షోకు 'అన్ స్టాపెబుల్' అనే టైటిల్‌ను ఫిక్స్ చేసిన‌ట్టు న్యూస్ ఒక‌టి బయటకు వచ్చింది. దీనికి సంబంధించి ఆహా వీడియో త్వ‌ర‌లో అధికారికంగా ప్ర‌క‌ట‌న వెలువ‌రించ‌నున్న‌ట్టు తెలుస్తోంది. ఈ టాక్ షోకు ఇండ‌స్ట్రీకి చెందిన ప‌లువురు ప్ర‌ముఖులు హాజ‌రుకానున్నారు. ఈ టాక్ షో ద్వారా వచ్చే రెమ్యునరేషన్ ను బాలయ్య కొన్ని స్వచ్ఛంద సంస్థలకు అందించనున్నారు.

బాల‌కృష్ణ ప్ర‌స్తుతం బోయపాటి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న అఖండ సినిమాలో పవర్ ఫుల్ రోల్స్ లో కనిపించనున్నారు. ఇటీవ‌లే సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. అన్న‌పూర్ణ స్టూడియోస్‌లో వేసిన భారీ సెట్లో సాంగ్ షూట్‌తో చిత్రీక‌ర‌ణ‌ను పూర్తిచేసింది యూనిట్‌. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర వేగంగా జ‌రుగుతున్నాయి. విడుద‌ల తేదీపై త్వ‌ర‌లోనే క్లారిటీ ఇవ్వ‌నున్నారు మేక‌ర్స్. ద్వారకా క్రియేష‌న్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్ర‌గ్యాజైశ్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. బాలకృష్ణ, బోయపాటి శ్రీ‌ను కాంబినేషన్‌లో తెర‌కెక్కుతోన్న హ్యాట్రిక్ చిత్రం కావడం.. ఈ సినిమాలో కూడా డ్యూయ‌ల్ రోల్ చేస్తున్నారు బాలకృష్ణ. ఒక పాత్రలో అఘోరాగా కనిపించ‌నున్నారు. ఇప్పటికే ఫస్ట్ రోర్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది.

Next Story