మరో రికార్డును సాధించిన 'భగవంత్‌ కేసరి' సినిమా

దసరా కానుగా వచ్చిన నందమూరి బాలకృష్ణ సినిమా 'భగవంత్ కేసరి' థియేటర్లలో విజయదుందుభి మోగిస్తోంది.

By Srikanth Gundamalla  Published on  25 Oct 2023 7:00 AM GMT
balakrishna, bhagavanth kesari, bookmyshow record,

మరో రికార్డును సాధించిన 'భగవంత్‌ కేసరి' సినిమా

దసరా కానుగా వచ్చిన నందమూరి బాలకృష్ణ సినిమా 'భగవంత్ కేసరి' థియేటర్లలో విజయదుందుభి మోగిస్తోంది. అన్ని చోట్లా మంచి టాక్‌ను సంపాదించుకుని కలెక్షన్లలో దూసుకెళ్తోంది. బాలకృష్ణ తెలంగాణ యాసలో మాట్లాడటం.. స్టైల్‌కు భిన్నంగా శ్రీలీల విజ్జిపాపగా చేయడంతో పాటు.. వీరి మధ్య సినిమాలో ఉన్న బాండ్‌ను ప్రేక్షకులు ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో ఉన్న ఓ సీన్‌ను అయితే అందరూ పొగిడేస్తున్నారు. నటసింహంతో చెప్పించిన బ్యాడ్ టచ్.. గుడ్‌ టచ్‌ వంటి సన్నివేశాలతో సందేశాన్ని ఇస్తున్నారని చెబుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా వంద కోట్ల క్లబ్‌లోకి దూసుకెళ్లింది. ఆరు రోజుల్లో రూ.104 కోట్ల గ్రాస్‌ సాధించింది. ఇంకా ఏమాత్రం తగ్గకుండా కలెక్షన్లలో దూసుకెళ్తోంది.

కాగా.. బాలకృష్ణ భగవంత్‌ కేసరి సినిమా తాజాగా మరో రికార్డును క్రియేట్ చేసింది. ఆన్‌లైన్‌ టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్‌ బుక్‌మై షోలో కేవలం 6 రోజుల్లో వన్ మిలియన్‌ ప్రేక్షకులు ఈ సినిమా టికెట్లు బుక్‌ చేసుకున్నారు. అయితే.. ఇది రికార్డు అని పేర్కొంటే బుక్‌ మై షో సోషల్‌ మీడియా వేదికగా ఓ పోస్టు పెట్టింది. దాంతో.. బుక్‌ మైషో పెట్టిన పోస్టు ఇప్పుడు ట్రెండింగ్‌లో దూసుకెళ్తుంది. ఈ విషయం తెలుసుకున్న బాలయ్య అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. బాలకృష్ణ రికార్డులకు కేరాఫ్‌ అంటూ కాలర్‌ ఎగరేస్తున్నారు.

కాగా.. భగవంత్‌ కేసరి మూవీకి రెస్పాన్స్ వ‌స్తుండ‌డంతో నిర్మాత‌లు, ద‌ర్శ‌కుడు, న‌టీన‌టులు ముందుకు వ‌చ్చి మ‌రీ ప్ర‌మోష‌న్స్‌ను పెంచేశారు. చిత్రం విడుద‌లైన మ‌రుస‌టి రోజే స‌క్సెస్ పార్టీ.. ఆ త‌రువాత బ్లాక్‌బ‌స్ట‌ర్ ధావ‌త్ అంటూ హంగామా చేస్తున్నారు. అంతేకాదు.. బాల‌కృష్ణ‌, కాజ‌ల్‌, శ్రీలీల‌లపై చిత్రీక‌రించిన ‘దంచ‌వే మేన‌త్త కూతురా’ పాట‌ను టైటిల్ ఎండ్ కార్డ్స్‌లో జ‌త చేశారు. ఇక ఆరు రోజుల్లో రూ.104 కోట్ల గ్రాస్ సాధించి రికార్డులు తిర‌గ‌రాస్తుండ‌డంతో అస‌లు సిస‌లు ద‌స‌రా విజేత భ‌గ‌వంత్ కేస‌రి అంటూ నిర్మాత‌లు ప్ర‌క‌టించేశారు.

Next Story