ప్రభాస్ మైనపు విగ్రహంపై ట్రోల్స్‌.. తొలగించాలంటూ నిర్మాత సీరియస్

బెంగళూరులో ఏర్పాటు చేసిన ప్రభాస్‌ మైనపు విగ్రహంపై సోషల్‌ మీడియాలో ట్రోల్స్‌ చేస్తున్నారు.

By Srikanth Gundamalla  Published on  26 Sep 2023 4:52 AM GMT
Bahubali, prabhas, wax Statue, bangalore, trolls, producer serious,

ప్రభాస్ మైనపు విగ్రహంపై ట్రోల్స్‌.. తొలగించాలంటూ నిర్మాత సీరియస్

బాహుబలి సినిమాతో రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌కు వరల్డ్‌ వైడ్‌గా గుర్తింపు వచ్చింది. రెండు పార్టులుగా వచ్చిన ఈ సినిమా టాలీవుడ్‌ ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా చాటిచెప్పింది. అయితే.. బాహుబలి తర్వాత ప్రభాస్‌ క్రేజ్‌ రావడంతో లండన్‌లోని ప్రఖ్యాత మేడమ్ టూస్సాడ్స్‌ మ్యూజియంలో బాహుబలి అవతార్‌లో ప్రభాస్‌ మైనపు బొమ్మను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేయడాన్ని ప్రతి ఒక్కరూ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తారు. అలాంటిది టాలీవుడ్‌ నుంచి ప్రభాస్‌ మైనపు విగ్రహం ఏర్పాటు చేయడంతో అందరూ ఎంతో ఆనందం వ్యక్తం చేశారు.

కాగా.. తాజాగా హీరో ప్రభాస్‌కు చెందిన మరో మైనపు విగ్రహం ప్రజల ముందుకు వచ్చింది. దీన్ని బెంగళూరులోని మ్యూజియంలో ప్రభాస్ కొత్త మైనపు బొమ్మను ఏర్పాటు చేశారు. ఈ విగ్రహం కూడా బాహుబలి అవతార్‌లోనే ఉంది. కానీ.. అంతగా ప్రభాస్‌ పోలికలు కనిపించడం లేదు. దాంతో.. ఈ విగ్రహం ప్రభాస్‌దేనా అటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. మైనపు విగ్రహం తయారు చేసేటప్పుడు కనీసం పోలికలు చూసుకోవాల్సింది కదా అంటూ ట్రోల్స్‌ చేస్తున్నారు. కొందరైతే ఈ మైనపు విగ్రహం డెవిడ్ వార్నర్‌లా ఉన్నాడని చెబుతున్నారు. వెంటనే ఈ బొమ్మను తీసేయాలని.. ప్రభాస్‌ ఇమేజ్‌ను డ్యామేజ్‌ చేయొద్దంటూ అభిమానులు ఫైర్ అవుతున్నారు. ప్రస్తుతం ఈ మైనపు విగ్రహానికి సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి.

బాహుబలిలో ప్రభాస్‌ లుక్స్‌కి సంబంధించిన మైనపు విగ్రహం ప్రస్తుతం వివాదంగా మారింది. దాంతో.. ఆ సినిమా నిర్మాత సీరియస్‌గా స్పందించారు. బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ రీషేర్‌ చేస్తూ వార్నింగ్ ఇచ్చారు. ఇది అధికారికంగా లైసెన్స్‌ తీసుకుని చేసిన వర్క్‌ కాదని చెప్పుకొచ్చారు. ఎలాంటి సమాచారం, అనుమతి తీసుకోకుండానే బొమ్మను షేర్ చేశారని చెప్పారు. మైనపు విగ్రహాన్ని తీసేయడానికి వెంటనే చర్యలు తీసుకుంటామని అన్నారు శోభు యార్లగడ్డ. కాగా.. నిర్మాత ట్వీట్ కూడా ప్రస్తుతం వైరల్ అవుతోంది. కాగా.. ఒక పక్క ట్రోల్స్.. మరోపక్క నిర్మాత సీరియస్‌గా వార్నింగ్‌ ఇవ్వడంతో బెంగళూరులోని మ్యూజియం వారు విగ్రహాన్ని తీసేస్తారా..? లేదంటే అలాగే ఉంచుతారా అనేది చూడాలి.

Next Story