'బేబీ' మూవీపై విజయ్‌ దేవరకొండ ట్వీట్, ఇక 'ఖుషీ' అంటోన్న నెటిజన్స్

తమ్ముడి సినిమా గురించి హీరో విజయ్‌ దేవరకొండ ట్వీట్‌ చేశారు.

By Srikanth Gundamalla  Published on  14 July 2023 3:45 PM IST
Baby, Movie, Vijay devarakonda, Tweet,

'బేబీ' మూవీపై విజయ్‌ దేవరకొండ ట్వీట్, ఇక 'ఖుషీ' అంటోన్న నెటిజన్స్ 

విజయ్‌ దేవరకొండ తమ్ముడు ఆనంద్‌ దేవరకొండ హీరోగా వచ్చిన తాజా చిత్రం 'బేబీ' థియేటర్లలో విడుదలై మంచి టాక్‌ తెచ్చుకుంటోంది. ట్రైయాంగిల్‌ లవర్‌ స్టోరీతో తెరకెక్కిన ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఈ క్రమంలోనే తమ్ముడి సినిమా గురించి విజయ్‌ దేవరకొండ ట్వీట్‌ చేశారు. నిన్న రాత్రే ప్రీమియర్ షో చూసిన విజయ్‌.. బీబీస్‌ చాలా బాగా చేశారంటూ ట్విట్టర్‌లో రాసుకొచ్చారు.

'బేబీ'సినిమాలో హీరోగా ఆనంద్‌ దేవరకొండ, హీరోయిన్‌గా వైష్ణవి చైతన్య, మరో హీరోగా విరాజ్‌ అశ్విన్ నటించారు. ప్రీమియర్ షోతోనే మూవీ హిట్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. అయితే.. ఈ సినిమా నుంచి విడుదలైనో ఓ రెండు ప్రేమ మేఘాలు సాంగ్‌ పెద్ద హిట్‌ అయ్యింది. దాంతో.. సినిమాపై అంచనాలు భారీగా పెట్టుకున్నారు ప్రేక్షకులు. వారి అంచనాలకు తగినట్లుగానే సినిమా తీశారని.. ఆనంద్ , వైష్ణవి యాక్టింగ్‌ చాలా బావుందంటూ ప్రశంసలు అందుతున్నాయి. జూలై 14న సినిమా విడుదలైనా.. ప్రీమియర్ షో మాత్రం అంతకు ముందు రోజు రాత్రే వేశారు. ఆ ప్రీమియర్‌ షోను పలువురు ప్రేక్షకులతో పాటు.. విజయ్‌ దేవరకొండ కూడా వీక్షించారు. సినిమా చూశాక.. ఆయన ఒక ట్వీట్‌ చేశారు. ఆనంద్‌, వైష్ణవితో ఉన్న ఫొటోలను షేర్‌ చేస్తూ..తనకు చాలా సంతోషంగా ఉందని.. ఈ బేబీస్‌ సాధించారని రాసుకొచ్చారు. వీళ్ల యాక్టింగ్‌ ప్రతి ఒక్కరి మనసుపై ప్రభావం చూపించిందని.. గత రాత్రి ప్రీమియర్స్‌లో సినిమా కథ ఎంతో ఏడిపిస్తే.. అది ఇచ్చిన సక్సెస్‌ ఎంతో సంతోషాన్ని ఇస్తోందని ఆనంద్‌ దేవరకొండ పేర్కొన్నారు.

ప్రస్తుతం ఆనంద్‌ దేవరకొండ 'బేబీ' సినిమా గురించి పెట్టిన ట్వీట్ తెగ వైరల్ అవుతోంది. పోస్టు చూసిన విజయ్‌ దేవరకొండ అభిమానులు.. తమ్ముడు హిట్‌ కొట్టేశాడు. ఇక మీరే హిట్‌ కొట్టాలన్నా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. లైగర్‌ సినిమా ఫ్లాప్‌తో విజయ్‌ అభిమానులను కాస్త నిరాశపరిచాడు. ప్రస్తుతం విజయ్‌ సమంతతో కలిసి 'ఖుషీ' సినిమాలో నటిస్తున్నాడు. అది త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. శివ నిర్వాణ డైరెక్ట్‌ చేస్తోన్న ఈ మూవీ రొమాంటిక్ లవ్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది. 'ఖుషీ' సినిమాపై అభిమానులు భారీ అంచనాలే పెట్టుకున్నారు.

Next Story