ఓటీటీలోకి వచ్చేస్తున్న 'బేబీ' మూవీ, వారికి మాత్రం స్పెషల్
చిన్న సినిమాగా వచ్చిన 'బేబీ' సినిమా ఓటీటీలో అందుబాటులోకి రానుంది.
By Srikanth Gundamalla Published on 18 Aug 2023 5:44 AM GMTఓటీటీలోకి వచ్చేస్తున్న 'బేబీ' మూవీ, వారికి మాత్రం స్పెషల్
చిన్న సినిమాగా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులను క్రియేట్ చేసిన మూవీ 'బేబీ'. ట్రైయాంగిల్ లవ్ స్టోరీగా వచ్చిన ఈ సినిమా థియేటర్లలో చూడలేకపోయిన వారు ఓటీటీలో ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నారు. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో కనిపించిన ఈ మూవీ.. జూలై 14న థియేటర్లలో విడుదలై హిట్ కొట్టింది. ఈ సినిమాను ముఖ్యంగా యువత ఎంతగానో ఆదరించారు. వైష్ణవి చైతన్య, ఆనంద్ దేవరకొండ నటన అందరినీ కట్టిపడేసింది. ఈ క్రమంలో ఓటీటీలో విడుదలయ్యే తేదీ ఖరారు అయ్యింది.
తెలుగు ఓటీటీ వేదిక 'ఆహా'లో బేబీ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆహా ఓటీటీ సంస్థ ట్వీట్ చేసింది. ఆగస్టు 25 నుంచి ఈ సినిమా ఆహా వేదికగా స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుపుతూ ఓ ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసింది. ఆహా గోల్డ్ సబ్‌స్క్రిప్షన్ ఉన్నవారికి అయితే 12 గంటల ముందుగానే అందుబాటులోకి రానుంది. గోల్డ్ సబ్‌స్క్రిప్షన్ ఉన్నవారికి ఆగస్టు 24వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి స్ట్రీమింగ్ కానుంది.
వైష్ణవి చైతన్య ఓ బస్తీ అమ్మాయి పాత్రలో నటించింది. చిన్నప్పటి నుంచి తన ఎదురింట్లో ఉండే ఆనంద్‌ను ప్రేమిస్తుంది. ఆ ప్రేమను అతనూ అంగీకరిస్తాడు. స్కూల్ డేస్ నుంచే ప్రారంభమయ్యే వీరి లవ్‌స్టోరీ అందరికీ కనెక్ట్ అయ్యింది. ఆనంద్ టెన్త్ ఫెయిల్ అవ్వడంతో ఆటో డ్రైవర్‌గా పనిచేస్తాడు. వైష్ణవి మాత్రం ఇంటర్ పూర్తి చేసి ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజ్‌లో చేరుతుంది. అక్కడ కొత్త పరిచయాలతో వైషూ ఆలోచనా విధానంలో మార్పులు వస్తాయి. తన క్లాస్‌మేట్ విరాజ్‌కు దగ్గర అవుతుంది. స్నేహం పేరుతో మొదలైన ఆ బంధం అడ్డదారులు తొక్కుతుంది. ట్రైయాంగ్‌లో కొనసాగే ఈ స్టోరీ యువతను ఆకట్టుకుంది.