అనుపమను బికినీ ఫోటో అడిగాడు.. అడ్రెస్ చెప్పమన్న బ్యూటీ

Anupama Shocking reply to Netizen.అనుపమ పరమేశ్వరన్.. తెలుగు సినీ అభిమానులకు ఎంతగానో దగ్గరైంది.

By M.S.R
Published on : 30 Sept 2021 7:30 PM IST

అనుపమను బికినీ ఫోటో అడిగాడు.. అడ్రెస్ చెప్పమన్న బ్యూటీ

అనుపమ పరమేశ్వరన్.. తెలుగు సినీ అభిమానులకు ఎంతగానో దగ్గరైంది. హోమ్లీ పాత్రలకు కేరాఫ్ అడ్రెస్ ఈ బబ్లీ బ్యూటీ. అతి తక్కువ సమయంలో టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. తెలుగుతో పాటు మలయాళం, తమిళ భాషలలో కూడా నటించి అక్కడ కూడా మంచి అభిమానాన్ని సొంతం చేసుకుంది. ఇక సోషల్ మీడియాలోను ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటూ అభిమానులకు దగ్గరగా ఉంటుంది ముద్దుగుమ్మ. ప్రస్తుతం 18 పేజెస్, రౌడీ బాయ్స్, కార్తికేయ-2 సినిమాలలో నటిస్తూ ఉంది.

ఇటీవలే అనుపమ తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్ లో తన అభిమానులతో ముచ్చట్లు పెట్టింది. అనుపమకు ఇష్టమైన రంగు దగ్గర నుండి.. ఆమె కుటుంబ సభ్యుల సమాచారం వరకూ అడిగారు. చాలా వాటికి అనుపమ సమాధానం చెప్పుతూ వెళ్ళింది. ఓ వ్యక్తి ఆమెను బికినీ ఫోటోలు పంపమని అడిగాడు. అయితే ఈ ప్రశ్నకు అనుపమకు బాగానే కోపం వచ్చింది. బికినీలో ఉన్న ఫోటోను పంపు అని అడిగేశాడు. దీనికి అనుపమ అదిరిపోయే కౌంటర్ ఇచ్చింది. బికినీలో ఉన్న ఫోటో కావాలా? నీ అడ్రస్ పంపు.. నేను ఫోటోను పంపుతా.. ఇంట్లో ఫ్రేమ్ కట్టించుకో అని కౌంటర్లు వేసింది. ఏది ఏమైనా అనుపమతో ఏదైనా అడిగే ముందు కాస్త ముందు వెనుకా చూసుకోవాల్సిందే..! లేదంటే లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేస్తుంది.

Next Story