'యానిమల్‌' మూవీ అసలు రన్‌టైమ్‌ తెలిస్తే షాకవుతారు..!

రణ్‌బీర్‌ కపూర్, సందీప్‌ వంగా కాంబినేషన్‌లో వస్తోన్న క్రేజీ సినిమా 'యానిమల్'.

By Srikanth Gundamalla  Published on  28 Nov 2023 1:20 PM IST
animal movie, long run time, sundeep, ranbir kapoor,

'యానిమల్‌' మూవీ అసలు రన్‌టైమ్‌ తెలిస్తే షాకవుతారు..!

రణ్‌బీర్‌ కపూర్, సందీప్‌ వంగా కాంబినేషన్‌లో వస్తోన్న క్రేజీ సినిమా 'యానిమల్'. ఈ మూవీ కోసం సినిమా ప్రేక్షకులంతా ఎంతగానో ఎదురుచూస్తున్నారు. రణ్‌బీర్‌ కు జంటగా ఈ సినిమాలో రష్మిక మందన్నా కనిపిస్తుంది. ఈ సినిమా నుంచి వచ్చిన ట్రైలర్‌ అయితే ఈ మూవీ అంచనాలను పెంచేసింది. తాజాగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ మూవీ టీమ్‌ విస్తృతంగా ప్రమోషన్లలో పాల్గొంటుంది. చెన్నైలో కూడా ప్రెస్‌మీట్‌ నిర్వహించారు. అక్కడ ప్రమోషన్స్‌లో భాగంగా రణ్‌బీర్, రష్మిక, సందీప్‌రెడ్డి హాజరయ్యారు. యానిమల్ మూవీ గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు.

యానిమల్‌ సినిమా కథ గురించి.. అందులోని పాత్రల గురించి కంటే ఎక్కువ ఈ సినిమా రన్‌ టైమ్‌ గురించే చర్చ జరుగుతోంది. ఈ సినిమాను ఏకంగా సందీప్‌రెడ్డి వంగా మూడు గంటల 21 నిమిషాల రన్‌టైమ్‌తో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ప్రస్తుతం సినిమాను ప్రేక్షకులు రెండున్నర గంటలు ఉంటేనే బోరింగ్‌గా ఫీలవడం ..లేదంటే ల్యాగ్‌ అంటుంటారు. కానీ.. సందీప్‌రెడ్డి వంగా మాత్రం ఏకంగా మూడు గంటల 21 నిమిషాల రన్‌టైమ్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తుండటంతో అందరూ దీని గురించే చర్చించుకుంటున్నారు. ఆయన గతంలో అర్జున్‌రెడ్డి సినిమా కూడా మూడు గంటల పాటు కొనసాగింది. అప్పట్లో ఆ సినిమా ఎంత హిట్‌ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా యానిమల్‌ సినిమాకు సెన్సార్‌ బోర్డు ఏ సర్టిఫికెట్‌ ఇచ్చింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎలా అలరిస్తుందో చూడాలి.

అయితే.. ప్రమోషన్స్‌లో భాగంగా హీరో రణ్‌బీర్ యానిమల్‌ మూవీ డ్యూరేషన్‌ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు. ఈ మూవీ అసలు రన్‌టైమ్‌ 3 గంటల 49 నిమిషాలు ఉందట. ఇంత లాంగ్ రన్‌టైమ్‌ మూవీని చూడాలంటే ఆడియన్స్‌కు కష్మే అనీ.. అందులోనూ నాలుగు షోలు రోజూ నడవాలంటే ఇబ్బందే అనుకున్నారట. దాంతో.. 3 గంటల 21 నిమిషాలకు రన్‌టైమ్‌ తగ్గించినట్లు తెలుస్తోంది. మరి థియేటర్లో అయితే అంత లాంగ్‌ టైమ్‌ సినిమాను చూసేందుకు ఇష్టపడరు కానీ.. ఓటీటీలో మాత్రం చూస్తారు ప్రేక్షకులు. మరి సందీప్‌ వంగా తీసిన మొత్తం డ్యూరేషన్‌ను ఓటీటీ వేదికగా తీసుకొస్తారా అనేది తెలియాల్సి ఉంది.

Next Story