విజయ్‌ దేవరకొండ సరసన యానిమల్ బ్యూటీ..!

టాలీవుడ్‌ రౌడీ హీరో విజయ్‌ ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్‌ సినిమాలో నటిస్తున్నాడు.

By Srikanth Gundamalla  Published on  20 Jan 2024 11:52 AM IST
actress tripti,  vijay devarakonda, movie,

విజయ్‌ దేవరకొండ సరసన యానిమల్ బ్యూటీ..!

టాలీవుడ్‌ రౌడీ హీరో విజయ్‌ ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్‌ సినిమాలో నటిస్తున్నాడు. పరుశురామ్‌ దర్శకత్వం వహిస్తుండగా.. మృణాల్‌ ఠాకూర్‌ హీరోయిన్‌గా చేస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్‌, టీజర్‌ హైప్‌ను పెంచుతున్నాయి. కాగా.. షూటింగ్‌ 90 శాతం పూర్తయినట్లు తెలుస్తోంది. విడుదలకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. అయితే.. విజయ్ చేతిలో ఈ సినిమానే కాక.. మరిన్ని చిత్రాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా జెర్సీ దర్వకుడు గౌతమ్‌ తన్ననూరితో ఒక ప్రాజెక్టు రాబోతుంది. ఇందులో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుందని చెప్పారు. అయితే.. ఈ చిత్రాన్ని అధికారికంగానే ప్రారంభించారు. సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై నిర్మిస్తోన్న ఈ కొత్త మూవీ నిత్యం వార్తల్లో నిలుస్తోంది.

తాజాగా విజయ్‌ కొత్త సినిమా గురించి మరో వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. శ్రీలీల విజయ్‌ సినిమా నుంచి తప్పుకున్నట్లు సమాచారం. డేట్స్ విషయంలో అడ్జస్ట్‌ కాకపోవడంతో శ్రీలాల ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుందని టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. నిజానికి ఈ సినిమా షూటింగ్ ముందే జరగాల్సి ఉంది. కానీ.. విజయయ ముందు ఫ్యామిలీ స్టార్‌ సినిమా చేస్తున్నాడు. దాంతో.. గౌతమ్‌ తిన్ననూరి ప్రాజెక్టు ఆలస్యం అయ్యింది. ఇక శ్రీలీల డేట్స్‌ ఇప్పుడు బిజీగా ఉండటంతో ఆమె ప్రాజెక్టు నుంచి తప్పుకుందని తెలుస్తోంది. దాంతో.. శ్రీలీల ప్లేస్‌లో బాలీవుడ్‌ హీరోయిన్‌ను తీసుకున్నారని సమాచారం. ఆమె ఎవరో కాదు.. యానిమల్‌ సినిమాతో సెన్సేషన్‌గా మారిన త్రిప్తి దిమ్రి. అయితే.. ఆమె విజయ్‌ పక్కన హీరోయిన్‌గా నటించబోతుందనేదానిపై ఇంకా అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.

ఇక యానిమల్ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను రాబట్టింది. రణబీర్‌కు జంటగా రష్మిక నటించింది. అయితే.. రష్మిక కంటే ఈ సినిమా ద్వారా ఎక్కువ క్రేజ్‌ వచ్చింది మాత్రం త్రిప్తి డిమ్రికే. ఈ సినిమా తర్వాత త్రిప్తి ఫాలోయింగ్ ఒక్కసారిగా మారిపోయింది. ఇప్పుడు వరుసగా సినిమాల్లో అవకాశాలు లభిస్తున్నాయి.

Next Story