కల్కి మూవీలోని 'బుజ్జి'ని డ్రైవ్ చేసిన ఆనంద్ మహీంద్ర (వీడియో)
సినిమా ప్రేక్షకులు ఇప్పుడు కల్కి 2898 ఏడి సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.
By Srikanth Gundamalla Published on 12 Jun 2024 3:45 PM IST
కల్కి మూవీలోని 'బుజ్జి'ని డ్రైవ్ చేసిన ఆనంద్ మహీంద్ర (వీడియో)
టాలీవుడ్ మాత్రమే కాదు దేశవ్యాప్తంగా ఉన్న సినిమా ప్రేక్షకులు ఇప్పుడు కల్కి 2898 ఏడి సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. నాగ్ అశ్విన్ ఈ మూవీని తెరకెక్కించారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించారు. అయితే.. ఇప్పటి ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్లు, ట్రైలర్ అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ మూవీపై మరింత హైప్‌ను పెంచాయి. ఈ నెల 27వ విడుదల కాబోతున్న ఈ మూవీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మూవీ విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాల్లో బిజీగా పాల్గొంటున్నారు. కల్కి మూవీలో హీరో ప్రభాస్ ఒక వెహికల్ తయారు చేసుకుంటాడు. దాని పేరే బుజ్జి. కల్కిలో బుజ్జి క్యారెక్టర్‌కు ప్రత్యేక స్థానం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బుజ్జి కోసం సపరేట్‌గా టీజర్ తో పాటు.. రెండు ఎపిసోడ్‌లను కూడా విడుదల చేశారు. బుజ్జి వాహనాన్ని చూసిన వారంతా షాక్ అవుతున్నారు. ఇంజీనిర్ల అద్భతమని అంటున్నారు. మూవీ కోసం నిజంగానే వాహనాన్ని తయారు చేయడం గొప్ప విషయం అంటున్నారు. బుజ్జిని ప్రముఖ స్టార్ హీరోలతో పాటు.. పోలీసులు, ఇతరులు నడిపారు. తాజాగా కల్కి బుజ్జిని వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర కూడా డ్రైవ్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
చెన్నైలో ఉంది ప్రస్తుతం కల్కి మూవీలోని బుజ్జి. అక్కడకు చేరుకున్న మహీంద్ర గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్ర బుజ్జిని డ్రైవ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోలను మేకర్స్ తమ సోషల్ మీడియా అకౌంట్‌లో పెట్టారు. ప్రముఖ కారు మహీంద్ర గ్రూప్ అధినేత బుజ్జిని చూడటం.. ఆ తర్వాత దాన్ని డ్రైవ్ చేయడంతో వైరల్ అవుతోంది.
#Bujji meets @anandmahindra…#Kalki2898AD #Kalki2898ADonJune27 pic.twitter.com/4VQCe3hSSv
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) June 12, 2024