ఇంకెంత ఏడిపిస్తారంటూ అమితాబ్‌ బచ్చన్‌ కంటతడి, వీడియో వైరల్

బాలీవుడ్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ కంటతడి పెట్టారు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది.

By Srikanth Gundamalla  Published on  10 Oct 2023 4:57 PM IST
amitabh bachchan, emotional, TV show, video viral,

ఇంకెంత ఏడిపిస్తారంటూ అమితాబ్‌ బచ్చన్‌ కంటతడి, వీడియో వైరల్

బాలీవుడ్‌ టాప్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ కంటతడి పెట్టారు. ఎనభై ఏళ్ల వయసులోనూ ఆయన యాక్టింగ్‌ చేయడంలో వెనక్కి తగ్గడం లేదు. వరుస పెట్టి సినిమాలు చేస్తూనే ఉన్నారు. అంతేకాదు.. మరోవైపు టీవీ షోల్లోనూ యాక్టివ్‌గా ఉంటున్నారు. దాంతో.. అభిమానులకు ఎప్పుడూ దగ్గరగానే ఉంటున్నారు బిగ్‌బీ. అయితే.. అమితాబ్‌ బచ్చన్‌ టీవీ షోలో కంటతడి పెట్టారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది.

అక్టోబర్‌ 11న అమితాబ్‌ బచ్చన్‌ పుట్టిన రోజు. అయితే.. ఆయనకు సర్‌ప్రైజ్‌ ప్లాన్‌ చేశారు ఒక ప్రొగ్రామ్‌ నిర్వాహకులు. అమితాబ్‌ బచ్చన్‌ 'కౌన్‌ బనేగా కరోడ్‌పతి' ప్రొగ్రామ్‌కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రోగ్రామ్‌ చాలా కాలంగా కొనసాగుతుంది. ప్రస్తుతం 15వ సీజన్‌ కొనసాగుతోంది. నిరంతరాయంగా జరుగుతున్న ఈ ప్రొగ్రామ్‌కు బిగ్‌బీ హోస్ట్‌గా వ్యవహరిస్తూ వస్తున్నారు. అక్టోబర్ 11న ఆయన బర్త్‌డే కావడంతో ఆ ప్రోగ్రామ్‌ నిర్వాహకులే సర్‌ప్రైజ్‌ ప్లాన్‌ చేశారు. సినిమా ఇండస్ట్రీలోని ప్రముఖులతో అమితాబ్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పిస్తూ ఓ వీడియో తీశారు. చిరంజీవి, విద్యాబాలన్, విక్కీ కౌశల్, బొమన్ ఇరానీలతో విష్ చేయించారు. ఆ వీడియో చూసిన అమితాబ్‌ బచ్చన్‌ భావోద్వేగానికి లోనయ్యారు. ఇంకా ఎంత ఏడిపిస్తారు.. కౌన్‌బనేగా కరోడ్‌పతి సెట్‌లో తన పుట్టినరోజు వేడు నిర్వహించుకోవడం ఎంతో ప్రత్యేకం అంటూ ఆనందంతో కంటతడి పెట్టుకున్నారు. అయితే.. దీనికి సంబంధించిన ప్రోమో వీడియోను సుదురు చానెల్ విడుదల చేసింది. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్ అవుతోంది.

ప్రస్తుతం అమితాబ్‌ బచ్చన్ పెద్ద సినిమాలతో బిజీగా ఉన్నారు. బాలీవుడ్‌తో పాటు దక్షిణాది సినిమాల్లోనూ ఆయన నటిస్తున్నారు. ప్రభాస్‌-నాగ్‌ అశ్విన్‌ కాంబోలో వస్తున్న కల్కి 2898 ఏడీ సినిమాలో కీలకపాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ గ్లింప్స్‌లో ఆయన కనిపించి ఆకట్టుకున్నారు. అలాగే రజనీకాంత్‌ మరో సినిమా 'తలైవా 170' మూవీలోనూ బిగ్‌బీ ముఖ్యపాత్రలో నటిస్తున్నారు.

Next Story