విడుదలకు రెడీ అయిన 'మీర్జాపూర్-3' వెబ్‌సిరీస్
ఇండియన్ వెబ్‌సిరీస్ అంటే టక్కున చాలా మందికి గుర్తుకు వచ్చేది 'మిర్జాపూర్'.
By Srikanth Gundamalla Published on 11 Jun 2024 3:08 PM ISTవిడుదలకు రెడీ అయిన 'మీర్జాపూర్-3' వెబ్‌సిరీస్
ఇండియన్ వెబ్‌సిరీస్ అంటే టక్కున చాలా మందికి గుర్తుకు వచ్చేది 'మిర్జాపూర్'. రెండు సీజన్లలో వచ్చిన ఈ వెబ్‌సిరీస్ ప్రేక్షకులను బాగా మెప్పించింది. ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయ్యి బ్లాంక్ బస్టర్‌గా నిలిచింది. ఇప్పటికీ ఈ సిరీస్‌ను చూస్తున్న వారు ఉన్నారు. అయితే.. రెండు సీజన్‌ల తర్వాత మూడో సీజన్ కూడా వస్తుందని గతంలో ప్రకటన చేశారు. దాంతో.. కొత్త సీజన్ కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. తాజాగా వారికి మీర్జాపూర్ టీమ్ గుడ్‌న్యూస్ చెప్పింది.
మీర్జాపూర్-3 టీజర్‌ను విడుదల చేశారు మేయర్స్. ఓటీటీ అమెజాన్ ప్రైమ్‌లోనే ఉంది. సీజన్-2 ముగింపులో మున్నా.. గడ్డు చేతిలో చనిపోయాడు. అయితే.. మున్నా మీర్జాపూర్‌కి కింగ్‌గా ఉంటాడు. ఆ మున్నా చనిపోవడంతో ఆ సింహాసనం.. గుడ్డుకి దక్కుతుంది. సింహాసనంపై కూర్చొన్న గుడ్డుని చంపేందుకు లోకల్ గ్యాంగ్స్ ప్రయత్నిస్తుంటాయి. ఈ క్రమంలో గుడ్డు మరి ఏం చేశాడు? ఎలా తప్పించుకుంటాడు? గుడ్డు సింహాసనాన్ని నిలబెట్టుకుంటాడా? అనేది సీజన్-3లో చూపిస్తారని సాచారం. ఇక పంకజ్ త్రిపాఠి, శ్వేతా త్రిపాఠి, అలీ ఫజల్, హర్షిత గౌర్, విజయవర్మ తో పాటు తదితరులు ఈ వెబ్‌సిరీస్‌లో నటించారు. గుర్మీత్ సింగ్, ఆనంద్ అయ్యర్ సంయుక్తంగా దర్శకత్వం వహించారు. మీర్జాపూర్-3 సీజన్ జులై 5వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుందని మేకర్స్ వెల్లడించారు.