అమలపాల్‌కు మ్యారేజ్ ప్రపోజల్..ఎస్ చెప్పేసిన బ్యూటీ (వీడియో)
మరోసారి అమల పాల్ మరోసారి వార్తల్లో నిలిచింది. ఈసారి తన రెండో పెళ్లి గురించి.
By Srikanth Gundamalla Published on 26 Oct 2023 6:30 PM ISTఅమలపాల్‌కు మ్యారేజ్ ప్రపోజల్..ఎస్ చెప్పేసిన బ్యూటీ (వీడియో)
అమలపాల్ సినీ ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. దక్షిణాదిన బిజీగా ఉన్న నటీమణుల్లో ఈమె ఒకరు. అంతేకాదే.. ఆమె సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ అభిమానులతో చాలా విషయాలు పంచుకుంటుంటారు. అయితే.. తెలుగులో అల్లు అర్జున సరసన ఇద్దరమ్మాయిలతో సినిమా, రామ్‌చరణ్‌తో నాయక్ సినిమాలో కలిసి నటించారు. నాయక్ మూవీ ఈమెకు బ్రేక్ ఇచ్చినా.. ఆ తర్వాత కొన్ని సినిమాలు మాత్రమే చేశారు.
దర్శకుడు ఎఎల్ విజయ్'దైవ తిరుమగళ్' అనే సినిమాలో విక్రమ్, అనుష్క శెట్టి తో పాటు అమల పాల్ ని కూడా తీసుకున్నాడు. అప్పుడే దర్శకుడు విజయ్, అమల ప్రేమలో పడ్డారు. కొన్నేళ్ల తరువాత 2014, జూన్ 12 న పెళ్లి కూడా చేసుకున్నారు. అయితే రెండేళ్ల తరువాత ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. విజయ్ తల్లిదండ్రులు, అమల పాల్ ని సినిమాల్లో నటించవద్దు అని ఒక షరతు పెట్టడంతో, అమల అందుకు ఒప్పుకోలేదు. దాంతో.. 2017లో విడాకులు తీసుకోవటం జరిగింది అని అప్పట్లో అనుకున్నారు. ఆతర్వాత అమల పాల్ తరచూ వార్తల్లో ఉంటూ వస్తోంది. అప్పట్లో ఒక ఖరీదైన కారు కొన్నప్పుడు, పన్ను సరిగ్గా కట్టలేదని అమల పాల్ ను అరెస్టు చేశారు అన్న వార్తలు బాగా వచ్చాయి. అందులో ఎంత నిజం ఉందొ తెలీదు కానీ, ఆ తరువాత ఆ కేసును కొట్టేశారని కూడా ప్రచారం జరిగింది.
మరోసారి అమల పాల్ మరోసారి వార్తల్లో నిలిచింది. ఈసారి తన రెండో పెళ్లి గురించి. అమల పుట్టిన రోజు వేడుకలను ఒక పబ్బులో సెలబ్రెట్ చేసిన తన స్నేహితుడు జగత్ దేశాయ్.. అదే సమయంలో పెళ్లి ప్రపోజల్ పెట్టాడు. డ్యాన్స్ చేస్తూ సర్‌ప్రైజ్ ఇచ్చాడు. రింగ్ తీసి అమల ముందు మోకాళ్లపై కూర్చొని విల్ యు మ్యారీమీ అని అడిగాడు. దాంతో.. వెంటనే అమలా పాల్ సైతం ఓకే చెప్పారు. ఈ వీడియోను షేర్ చేస్తూ.. నా రాణి ఎస్ చెప్పింది.. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాం అంటూ యాడ్ చేశాడు జగద్ దేశాయ్. అయితే.. ఇదే వీడియోను అమల పాల్ కూడా షేర్ చేసింది. ప్రస్తుతం నెట్టింట ఈ వార్తతో పాటు.. వీడియో తెగ వైరల్ అవుతోంది. అయితే వివాహం ఎప్పుడు జరగబోయేది ఇంకా తెలియలేదు, కానీ అమల పాల రెండో వివాహం దేశాయ్ అనే అబ్బాయితో మాత్రం జరగబోతోంది అని తెలుస్తోంది. అందరూ ఇప్పుడు ఈ అబ్బాయి ఎవరా అని ఆరా తీస్తున్నారు, గూగుల్ చేస్తున్నారు.