నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ విన్నర్స్‌కు మైత్రీ మూవీస్ పార్టీ, బన్నీ ఆసక్తికర కామెంట్స్
బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకున్న అల్లు అర్జున్ ఓ పార్టీలో ఆసక్తికర కామెంట్స్ చేశారు.
By Srikanth Gundamalla Published on 22 Oct 2023 3:46 PM IST
నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ విన్నర్స్‌కు మైత్రీ మూవీస్ పార్టీ, బన్నీ ఆసక్తికర కామెంట్స్
ఇటీవల కేంద్ర ప్రభుత్వం జాతీయ సినిమా అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత అవార్డులను రాష్ట్రపతి ప్రదానం కూడా చేశారు. అయితే.. పుష్ప సినిమాకు గాను జాతీయ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్.. ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవీ శ్రీప్రసాద్ ఈ అవార్డులను అందుకున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా అయితే ఏకంగా ఆరు జాతీయ పురస్కారాలను సొంతం చేసుకుంది. ఈ క్రమంలో నేషనల్ ఫిల్మ్ అవార్డు విన్నర్స్ కోసం మైత్రీ మూవీ మేకర్స్ చిత్ర నిర్మాణ సంస్థ గ్రాండ్ పార్టీ ఇచ్చింది. ఈ పార్టీకి అవార్డులు అందుకున్నవారితో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకున్న అల్లు అర్జున్ ఈ పార్టీలో ఆసక్తికర కామెంట్స్ చేశారు.
తనతో పాటు దేవీశ్రీ ప్రసాద్‌కు కూడా నేషనల్ అవార్డు వచ్చిందని.. దాంతో తన నాన్న అల్లు అర్వింద్ చాలా సంతోష పడ్డారని చెప్పారు. ఇద్దరు కొడుకులకు జాతీయ అవార్డు వచ్చినట్లుంది అని పొగిపోయారని అన్నారు. డీఎస్‌పీ తండ్రి సత్యమూర్తి ఇప్పుడు లేకపోవచ్చు కానీ.. దేవీశ్రీప్రసాద్ కూడా తన కొడుకులాంటి వాడే అని అల్లు అర్వింద్ అంటారని అన్నారు. అందుకే అతను అవార్డు అందుకోవడాన్ని చూడటం కోసం అల్లు అర్వింద్ ఢిల్లీ వచ్చారనీ తెలిపారు. తనకు జాతీయ అవార్డు వచ్చినప్పుడు ఎంత సంతోష పడ్డారో.. దేవీకి వచ్చినప్పుడు కూడా అంతే సంతోషపడ్డారని అల్లు అర్జున్ చెప్పారు.
అవార్డు వచ్చిన సందర్భంగా అల్లు అర్వింద్‌తో మాట్లాడిన పలు అంశాలను అల్లు అర్జున్ అందరితో పంచుకున్నారు. చెన్నైలో ఇద్దరు పోరంబోకులు.. కనీసం స్కూల్ ప్రిన్సిపల్ వద్ద సర్టిఫికెట్లు కూడా తీసుకునేవాళ్లం కాదని అల్లు అర్జున్ అన్నాడు. కానీ ఢిల్లీలో ప్రెసిడెంట్ మెడల్ అందుకుంటామని అనుకున్నావా అంటూ.. తన తండ్రితో అడిగినట్లు అల్లు అర్జున్ అన్నారు. అల్లు అర్జున్ కామెంట్స్‌తో పార్టీలో పాల్గొన్నవారంతా నవ్వారు. అయితే.. ప్రస్తుతం అల్లు అర్జున్ కామెంట్స్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Allu Arjun - Allu Aravind చెన్నైలో ఇద్దరు పోరంబోకులు (బన్నీ, దేవి) ప్రిన్సిపాల్ నుండి ఎప్పుడూ సర్టిఫికెట్ తీసుకొని మేము ప్రెసిడెంట్ దగ్గర మెడల్ తీసుకుంటాం అనుకున్నావా?#Pushpa2TheRule pic.twitter.com/eQPrvaFQsY
— M9.NEWS (@M9Breaking) October 22, 2023