'యానిమల్' మూవీపై ఓ రేంజ్‌లో రివ్యూ ఇచ్చిన అల్లు అర్జున్

టాలీవుడ్‌ డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి ప్రస్తుతం సంచలనంగా మారారు.

By Srikanth Gundamalla  Published on  8 Dec 2023 4:10 PM IST
allu arjun, tweet,  animal movie, review,

'యానిమల్' మూవీపై ఓ రేంజ్‌లో రివ్యూ ఇచ్చిన అల్లు అర్జున్

టాలీవుడ్‌ డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి ప్రస్తుతం సంచలనంగా మారారు. గతంలో సందీప్‌రెడ్డి వంగా తీసిన అర్జున్‌ రెడ్డి థియేటర్లలో ప్రేక్షకుల మైండ్‌ పోగొట్టింది. ఆయన తాజాగా బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ రణ్‌బీర్‌ కపూర్‌తో యానిమల్‌ సినిమాను తీశారు. విడుదలైన ఆరు రోజుల్లోనే దాదాపు రూ.500 కోట్ల వసూళ్లు రాబట్టింది ఈ సినిమా. రణ్‌బీర్‌కు జంటగా ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక కనిపించారు. అభిమానుల భారీ అంచానల మధ్య యానిమల్ మూవీ డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాను చూసిన ప్రతిఒక్కరు ఏం సినిమా తీశావ్‌ బాసూ అంటున్నారు. సినీ ప్రముఖులు కూడా యానిమల్‌ మూవీపై ప్రసంశలు కురిపిస్తున్నారు. ఇప్పటికే దర్శకుడు రాంగోపాల్‌ వర్మ డైరెక్టర్ సందీప్‌ రెడ్డి వంగాను ఆకాశానికి ఎత్తేశారు. రివ్యూలో ఈ సినిమాను గొప్పగా చెప్పుకొచ్చారు.

తాజాగా ఇదే సినిమాపై ఐకాన్‌ స్టార్ అల్లు అర్జున్ కూడా మనసుపారేసుకున్నారు. సినిమా గురించి వివరణాత్మకంగా రివ్యూ ఇచ్చారు. యానిమల్ సినిమా చూశాను అనీ.. మతిపోయిందంతే అంటూ రివ్యూ ఇచ్చారు. సినీ మేధస్సుకు పరాకాష్ట ఈ సినిమా అన్నారు. చిత్రబృందానికి అభినందనలు తెలిపారు. ఈ మేరకు యానిమల్ సినిమాపై రివ్యూ ఇస్తూ అల్లు అర్జున్ ఎక్స్‌ వేదికగా పోస్టు పెట్టారు.

యానిమల్ మూవీలో ఎవరెవరు ఎలా నటించారనే దానిపై ఒక్కొక్కరి పేర్లు రాసుకొచ్చారు.

రణ్‌బీర్‌ కపూర్: భారతీయ నటనా ప్రతిభను రణ్‌బీర్‌ కపూర్‌ మరో ఎత్తుకు తీసుకెళ్లాడు అని అల్లు అర్జున్ అన్నారు. రణ్‌బీర్‌ నటన ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉందన్నారు. రణ్‌బీర్‌ నటించిన విధానం చెప్పడానికి మాటల్లేవ్‌.. అతను నెలకొల్పిన ప్రమాణాలకు ప్రగాఢ గౌరవం ఇస్తున్నానని అల్లు అర్జున్ చెప్పారు.

రష్మిక మందన్న: యానిమల్ సినిమాలో రష్మిక అద్భుతంగా, ఆకర్షణీయంగా నటించిందని అల్లు అర్జున్ చెప్పారు. ప్రియమైన రష్మిక ఇప్పటి వరకు అత్యుతన్నత నటనా ప్రదర్శన ఇదే అన్నారు. తదుపరి చిత్రాల్లో నటనా ప్రతిభను ఇలాగే కొనసాగించాలని నమ్ముతున్నట్లు అల్లు అర్జున్ పేర్కొన్నారు.

బాబీ డియోల్: ఈ చిత్రంలో బాబీ డియోల్ ప్రభావశీల నటన చూస్తే మనం మాటలు మర్చిపోతామన్నారు అల్లు అర్జున్. బాబీ డియోల్ బీభత్సకరమైన నటనతో ప్రతి ఒక్కరి మనసును ఆకట్టుకున్నారని చెప్పారు.

అనిల్ కపూర్: ఈ సినిమాలో అనిల్ కపూర్ తన పాత్రలో ఎంతో సునాయాసంగా నటించారని అల్లు అర్జున్ చెప్పారు. అదే సమయంలో తన పాత్రలో ఎంత తీవ్రత ఉందో కూడా చూపించారని అన్నారు. అనిల్‌ కపూర్‌ అనుభవం విలువ ఎంటో చాటిచెప్పారని పొడిగారు.

తృప్తి దిమ్రి: ఈ అమ్మాయి అందరి హృదయాలను బ్రేక్‌ చేసిందన్నారు అల్లు అర్జున్. తృప్తీ ఇంకా మున్ముందు ఇంకా మారెన్నో హృదయాలను బద్దలు కొడతావనిపిస్తోందని ఎక్స్‌ వేదికగా రాసారు అల్లు అర్జున్.

యానిమల్ దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా జస్ట్‌ మైండ్ బ్లోయింగ్‌ అని చెప్పారు. సినిమా పరిథులన్నీ సందీప్‌ దాటేశాడని చెప్పారు. మరోసారి సినిమా ఇండస్ట్రీలో ఉన్నవారందరూ గర్వించేలా సందీప్‌ వంగా చేశాడని అల్లు అర్జున్ అన్నారు.

Next Story