అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో మరో సినిమా కన్ఫామ్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలిసి మరో సినిమా చేయబోతున్నారు.
By Srikanth Gundamalla Published on 3 July 2023 11:53 AM ISTఅల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో మరో సినిమా కన్ఫామ్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలిసి మరో సినిమా చేయబోతున్నారు. కొంతకాలంగా వీరి సినిమాపై ఊహాగానాలు వినిపించాయి. తాజాగా వాటిని నిజం చేస్తూ అధికారిక ప్రకటన వెల్లడించారు. సోమవారం ఉదయం 10:08 గంటలకు అల్లుఅర్జున్, త్రివిక్రమ్ సినిమాకు సంబంధించిన వివరాలను తెలిపారు.
అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న నాలుగో సినిమా ఇది. ఇంతకు ముందు ‘జులాయి', ‘సన్ ఆఫ్ సత్యమూర్తి', ‘అలా వైకుంఠపురములో' సినిమాలు తీశారు. నాలుగో సినిమాను హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించనున్నాయి. అలా వైకుంఠపురములో చిత్రాన్ని ఈ రెండు సంస్థలు కలిసే నిర్మించాయి. అప్పుడు ఇండస్ట్రీ హిట్‌ను అందించాయి. అయితే.. త్రివిక్రమ్, అల్లు అర్జున్ ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చిన మూడు సినిమాలు అద్భుత విజయాలను సాధించాయి. ఒకదానికి మించి మరోటి బాక్సాఫీస్ వద్ద రికార్డులను తిరగరాశాయి. దీంతో.. నాలుగు సినిమాపైన కూడా అంచనాలు భారీగానే పెట్టుకున్నారు అల్లు అర్జున్ అభిమానులు.
ఈ సినిమాకు సంబంధించిన మిగతా వివరాల త్వరలో వెల్లడి చేస్తామని పేర్కొన్నారు. అయితే.. త్రివిక్రమ్, అల్లు అర్జున్ నాలుగో సినిమాలో కూడా పూజా హెగ్డేనే హీరోయిన్ ఉండొచ్చని టాక్ నడుస్తోంది. ప్రస్తుతం మహేశ్‌బాబు 'గుంటూరు కారం' సినిమా చేస్తున్నారు త్రివిక్రమ్. దీంట్లో హీరోయిన్‌గా చాన్స్ మిస్సయింది పూజ. కానీ.. బన్నీతో జతకట్టే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. మరోవైపు అల్లు అర్జున్ పుష్ప పార్ట్-2 షూటింగ్ బిజీలో ఉన్నారు. పుష్ప ది రైజ్ పెద్ద హిట్ అయ్యింది. దాంతో పుష్ప ది రూల్‌పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. డైరెక్టర్ సుకుమార్ కూడా అందుకు తగ్గట్లే సినిమా తీస్తున్నారు.