'పుష్ప 2' షూటింగ్ ఎక్స్ క్లూజివ్ అప్ డేట్ !

Allu Arjun to shoot intense fight scenes in Bangkok.'పుష్ప ది రూల్' సినిమా షూటింగ్ సంబంధించి ఓ ఆసక్తికరమైన అప్‌డేట్

By Sumanth Varma k  Published on  11 Nov 2022 1:35 PM IST
పుష్ప 2 షూటింగ్ ఎక్స్ క్లూజివ్ అప్ డేట్ !

'పుష్ప ది రూల్' సినిమా షూటింగ్ సంబంధించి ఓ ఆసక్తికరమైన అప్‌డేట్ తెలిసింది. బ్యాంకాక్‌లోని దట్టమైన అడవుల్లో ఈ సినిమా కొత్త షెడ్యూల్ ను చిత్రీకరించడానికి వచ్చే వారం నుండి ప్లాన్ చేస్తున్నారు. బ్యాంకాక్‌లో ప్రారంభమవుతున్న ఈ షెడ్యుల్ 2-3 వారాల పాటు జరగనుంది. ఇప్పటికే 'పుష్ప 2' పై భారీ అంచనాలు ఉన్నాయి. 'పుష్ప 2' భారీగా ఉండేలా మేకర్స్ కూడా భారీగా ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యంగా దర్శకుడు సుకుమార్ ఈసారి సీక్వెల్ కోసం చాలా గ్రాండ్ గా, వినూత్నమైన కథాకథనాలను సిద్ధం చేశాడు.

ఈ క్రమంలోనే బన్నీ క్యారెక్టర్ కి జోడిగా మరో క్యారెక్టర్ ను తీసుకొస్తున్నాడు. ఆ పాత్రకు సాయి పల్లవి ఓకే చెప్పింది. పైగా తన పాత్రకు తానే కాస్ట్యూమ్స్ ను డిజైన్ చేసుకుంటుంది. ఇక తన పాత్ర కోసం ఆమె చిత్తూరు యాస కూడా నేర్చుకుంటుంది. అన్నట్టు సాయిపల్లవి ని ఈ సినిమాలో మన్యం బిడ్డగా చూపించబోతున్నారట. మొత్తానికి పుష్ప 2 కోసం భారీ కసరత్తులు చేస్తున్నారు సుకుమార్ బ్యాచ్.

అందుకే.. ఓటీటీ సంస్థలు కూడా పుష్ప 2 కోసం పోటీ పడుతున్నాయి. ఏది ఏమైనా పార్ట్ 1 అంచ‌నాల‌ను అందుకుంది. అందుకే, పార్ట్ 2 పై రెట్టింపు ఆసక్తి కలిగింది. ఇక పార్ట్-1లో ఉన్న పాత్రలే పార్ట్-2లో కూడా ఉంటాయి. అలాగే పార్ట్ 2లో మరో 3 కొత్త పాత్రలు యాడ్ అవుతాయి. అలాగే పార్ట్ 2లో ఫహాద్ ఫాజిల్ నట విశ్వరూపాన్ని చూస్తారని సుకుమార్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చాడు. మరి చూడాలి సినిమా ఎలా ఉండబోతుందో.

Next Story