మరో 200 రోజుల్లో పుష్పరాజ్‌ రూల్స్‌.. మూవీ రిలీజ్‌పై క్లారిటీ

పుష్పకు సీక్వెల్‌ గా పుష్ప-2 తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా చేస్తోంది చిత్ర యూనిట్.

By Srikanth Gundamalla  Published on  29 Jan 2024 10:44 AM
allu arjun, pushpa-2, release date, movie unit, tweet,

మరో 200 రోజుల్లో పుష్పరాజ్‌ రూల్స్‌.. మూవీ రిలీజ్‌పై క్లారిటీ

ఐకాన్‌ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా ఎంత పెద్ద హిట్‌గా నిలిచిందో అందరికీ తెలిసిందే. సినిమాలోని పాటులు.. డైలాగ్స్‌.. బన్నీ యాక్టింగ్‌కు ప్రత్యేక క్రేజ్ ఏర్పడింది. అన్ని భాషల్లో కూడా ఈ సినిమా పెద్ద హిట్‌గా నిలిచింది. ముఖ్యంగా పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫైరూ.. తగ్గేదేలే అనే డైలాగ్స్‌కు ఫ్యాన్స్‌ ఫిదా అయిపోయారు. థియేటర్లలో ఈలలు, కేకలతో అభిమానులు ఊగిపోయారు. అయితే.. పుష్పకు సీక్వెల్‌ గా పుష్ప-2 తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా చేస్తోంది చిత్ర యూనిట్.

తొలి భాగం పెద్ద హిట్ కావడంతో.. దానిని మించి తీయాలని సుకుమార్ యూనిట్ అన్ని విధాలుగా కృషి చేస్తోంది. ఇక ఈ సినిమాకు గాను అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా జాతీయ పురస్కారం అందుకోవడం.. ఇన్నేళ్ల తెలుగు సినీ చరిత్రలో ఉత్తమ నటుడిగా ఇదే తొలి పురస్కారం కావడంతో పార్ట్‌ -2 కోసం హీరో అల్లు అర్జున్ సహా చిత్ర యూనిట్ మొత్తం బాధ్యతతో పనిచేస్తున్నారు. షూటింగ్ శరవేగంగా సాగుతున్న పుష్ప-2 సినిమా విడుదలపై ఇప్పటికే మేకర్స్‌ ప్రకటన విడుదల చేశారు. ఆగస్టు 15న వరల్డ్‌ వైడ్‌గా ఈ సినిమాను రిలీజ్‌ చేస్తున్నట్లు ఇప్పటికే చెప్పారు. కానీ.. సినిమా విడుదల వాయిదా అంటూ రెండుమూడు రోజులుగా ప్రచారం జరుగుతోంది.

ఈ క్రమంలోనే పుష్ప-2 విడుదలపై తాజాగా చిత్ర యూనిట్ స్పందించింది. అనుకున్న సమయానికే పుష్పరాజ్‌ ర్యాంపేజ్‌ ఖాయం అని ట్వీట్ చేశారు. ఇంకా 200 రోజుల్లో పుష్పరాజ్‌ రూల్స్‌ ప్రారంభం కానున్నాయని చెప్పారు. ఈ మేరకు కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది దర్శకుడు సుకుమార్‌ టీమ్. దాంతో.. పుష్ప-2 విడుదలలో ఎలాంటి మార్పు లేదని క్లారిటీ ఇచ్చినట్లు అయ్యింది. కాగా.. ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పక్కన హీరోయిన్‌గా రష్మిక మందన్నా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ మూవీ నిర్మిస్తోంది. సునీల్, ఫవాద్‌ ఫాజిల్, అనసూయ కీలక పాత్రదారులు. మూవీకి దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

Next Story