తగ్గేదే లే.. సోషల్ మీడియాలో అల్లు అర్జున్ మరో రికార్డు
తాజాగా ఈ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సోషల్ మీడియాలో కొత్త రికార్డును సృష్టించారు.
By Srikanth Gundamalla Published on 25 July 2023 11:52 AM ISTతగ్గేదే లే.. సోషల్ మీడియాలో అల్లు అర్జున్ మరో రికార్డు
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు ఉన్న ఫ్యాన్ బేస్ గురించి అందరికీ తెలిసిందే. ఆయన స్టైల్‌ను చాలా మంది యువత ఫాలో అవుతుంటారు. ఇక పుష్ప తర్వాత అయితే అల్లు అర్జున్ రేంజే మారిపోయింది. వరల్డ్ వైడ్‌గా ఐకాన్ స్టార్‌కు ఫ్యాన్స్ పెరిగిపోయారు. ఎక్కడ చూసినా పుష్ప డైలాగ్‌లు, పాటలే వినిపించాయి. సోషల్ మీడియాలోనూ అల్లు అర్జున్‌కు కోట్ల మంది ఫోలవర్స్ ఉంటారు. తాజాగా ఈ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సోషల్ మీడియాలో కొత్త రికార్డును సృష్టించారు.
ఇటీవల ట్విట్టర్‌కు పోటీగా జుకర్ బర్గ్ కొత్తగా థ్రెడ్స్ (Threads) అనే యాప్‌ను తీసుకొచ్చారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే.. ఈ యాప్‌లోనే అల్లు అర్జున్ కొత్త రికార్డుని క్రియేట్ చేశారు. అత్యంత తక్కువ సమయంలోనే 10 లక్షల మంది ఫాలోవర్స్‌ను సొంతం చేసుకున్నారు. ఇంతమంది ఫాలోవర్స్‌ను పొందిన తొలి భారతీయ నటుడిగా బన్నీ రికార్డు సృష్టించారు. దీంతో.. ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. క్రేజీ కామెంట్స్ పెడుతున్నారు. ఎక్కడైనా సరే రికార్డులు బన్నీ పేరిటే ఉంటాయంటున్నారు. ఎక్కడ అయినా సరే తగ్గేదే లే అంటూ పుష్ప సినిమాలోని డైలాగ్ చెబుతున్నారు.
ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప ది రూల్ చిత్రంలో నటిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. పుష్ప ది రైజ్‌కు కొనసాగింపుగా ఈ సినిమా తెరకెక్కుతోంది. మొదటి భాగానికి మించి రెండో భాగం ఉంటుందని అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. ఒక మొన్న అల్లు అర్జున్ కూడా సెకండ్ పార్ట్‌పై మరింత క్రేజ్ పెంచేందుకు డైలాగ్‌ను లీక్ చేశారు.దాంతో.. ఈ సినిమాపై అంచనాలు మరింత రెట్టింపు అయ్యాయి. థ్రెడ్స్ యాప్‌లో ప్రస్తుతం మొత్తం అల్లు అర్జున్ గురించే చర్చ జరుగుతోంది. ట్రెండింగ్‌లో కొనసాగుతున్నారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ట్రెండింగ్‌లోకి రావడానికి మరో కారణం కూడా ఉంది. భారత మాజీ క్రికెటర్ ధోనీ భార్య సాక్షి అందరికీ తెలుసు. సాక్షి తాజాగా ‘లెట్స్ గెట్ మ్యారీడ్’ (LGM) చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నారు. హైదరాబాద్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ గురించి మాట్లాడారు. అల్లు అర్జున్‌కు తాను వీరాభిమానిని అని చెప్పుకొచ్చారు. అంతేకాదు..రిలీజ్ అయిన అల్లు అర్జున్ ప్రతి సినిమాను చూస్తానని చెప్పింది. ఓటీటీ, యూట్యూబ్‌లో కూడా బన్నీ సినిమాలను చూస్తానని చెప్పింది. దాంతో.. సాక్షి కామెంట్స్‌ను కూడా ట్యాగ్ చేస్తూ అల్లు అర్జున్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.