ఏప్రిల్ 8న అల్లు అర్జున్‌ బర్త్‌డే.. ఉదయమే టీజర్‌ రిలీజ్‌

టాలీవుడ్‌ ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్, సుకుమార్‌ కాంబినేషన్‌లో వస్తోన్న సినిమా పుష్ప-ది రూల్‌ వస్తోంది.

By Srikanth Gundamalla  Published on  7 April 2024 4:00 PM GMT
allu arjun, birthday, pushpa-the rule, movie teaser,

ఏప్రిల్ 8న అల్లు అర్జున్‌ బర్త్‌డే.. ఉదయమే టీజర్‌ రిలీజ్‌ 

టాలీవుడ్‌ ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్, సుకుమార్‌ కాంబినేషన్‌లో వస్తోన్న సినిమా పుష్ప-ది రూల్‌ వస్తోంది. పుష్ఫ-ది రైజ్‌కు కంటిన్యూగా ఈ మూవీని తీస్తున్నారు. మొదటి పార్ట్‌కు భారీగా ప్రేక్షకాదరణ లభించింది. ఈ సినిమాలో నటనకు గాను అల్లు అర్జున్‌కు జాతీయ పురస్కారం కూడా లభించింది. ఇందులో పాటలు, డైలాగ్స్‌.. యాక్షన్ సీన్స్‌కు ఓ రేంజ్‌లో మెప్పించాయి. దాంతో.. పుష్ప-2పై భారీగా అంచనాలు పెరిగాయి. ఫ్యాన్స్‌ ఆశలకు అనుగుణంగానే సుకుమార్‌ పుష్ప-2ను తెరకెక్కిస్తున్నాడు.

ఏప్రిల్ 8వ తేదీన ఐకాన్‌ స్టార్ అల్లు అర్జున్ బర్త్‌డే ఉంది. ఆయన పుట్టిన రోజు సందర్భంగా పుష్ప-ది రూల్‌ టీజర్‌ విడుదల కాబోతుంది. చిత్ర యూనిట్‌ ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది. ఏప్రిల్ 8వ తేదీ ఉదయం 11.07 గంటలకు ఈ టీజర్‌ను విడుదల చేయనున్నారు. సోమవారం అల్లు అర్జున్‌ పుట్టినరోజు సందర్భంగా ఉదయం 11.07 గంటలకు టీజర్‌ను విడుదల చేయనున్నట్లు చెబుతూ సరికొత్త పోస్టర్‌ను పంచుకుంది. ‘అతడు అన్ని అడ్డంకులను దాటుకుని పైకెదిగాడు.. ఇప్పుడు రూల్‌ చేయడానికి వస్తున్నాడు’ అంటూ క్యాప్షన్‌ జోడించింది. పోస్టర్‌లో పుష్పరాజ్‌గా అల్లు అర్జున్‌ చేతిలో గొడ్డలి పట్టుకుని, కుర్చీలో కూర్చొని తీక్షణంగా చూస్తున్న ఫొటో పోస్ట్‌ చేసిన నిమిషాల్లో ట్రెండింగ్‌లోకి వచ్చింది.

ఇక ఇటీవల రష్మిక మందన్న పుట్టినరోజు సందర్భంగా కూడా ఆమె పాత్రకు సంబంధించిన ఫొటోను కూడా చిత్ర యూనిట్ విడుదల చేసింది. పట్టు చీర కట్టుకుని, బంగారు ఆభరణాలు ధరించి చేతి వేళ్ల మధ్య నుంచి ఒక కన్నుతో చూస్తోన్న ఫొటో నెట్టింట వైరల్ అయ్యింది. అభిమానులు కూడా ఆపోస్టర్‌ను చూసి ఫిదా అయ్యారు. ఇక తాజాగా బన్నీ ఫొటోను చూసి ఊర మాస్‌ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ ఈ టీజర్ రూపకల్పన కోసం శ్రమిస్తున్నారు.


Next Story