పుష్ప-2 టీజర్ రిలీజ్.. మాతంగి గెటప్‌లో అల్లు అర్జున్

అల్లు అర్జున్ బర్త్‌డే సందర్భంగా చిత్ర యూనిట్ స్పెషల్‌ సర్‌ప్రైజ్‌ను ఇచ్చింది

By Srikanth Gundamalla  Published on  8 April 2024 11:52 AM IST
allu arjun, birthday, pushpa-2, teaser release ,

పుష్ప-2 టీజర్ రిలీజ్.. మాతంగి గెటప్‌లో అల్లు అర్జున్

సినిమా ప్రేక్షకులు ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తోన్న సినిమాల్లో ఒకటి 'పుష్ప-ది రూల్'. అల్లు అర్జున్‌ హీరోగా వచ్చిన ఈ మూవీ ఫస్ట్‌ పార్ట్‌ ఘన విజయం సాధించింది. అల్లు అర్జున్‌కి నటనకు గాను బెస్ట్‌ యాక్టర్‌ అవార్డు దక్కింది. ఈ సినిమాలోని పాటలు, డైలాగ్స్‌.. యాక్షన్ సీన్స్‌ అందరినీ అలరించాయి. దాంతో.. పుష్ప-ది రూల్‌ మూవీపై అందరి దృష్టి ఉంది. దీనికి తగ్గట్లుగానే డైరెక్టర్ సుకుమార్ కూడా చిత్రాన్ని అంచనాలకు తగ్గట్లుగా రూపొందిస్తున్నారు. కాగా.. తాజగా అల్లు అర్జున్ బర్త్‌డే సందర్భంగా చిత్ర యూనిట్ స్పెషల్‌ సర్‌ప్రైజ్‌ను ఇచ్చింది

సోమవారం అల్లు అర్జున్ బర్త్‌డే సందర్బంగా పుష్ప-ది రూల్‌ సినిమా నుంచి టీజర్‌ను విడుదల చేసింది. సినిమాలో కీలకంగా సాగే జాతర సన్నివేశాలతో ఇది సిద్దమైంది. మాతంగి గెటప్‌లో బన్నీ లుక్స్‌.. యాక్షన్‌ సన్నివేశాలు అదిరిపోతున్నాయి. టీజర్‌ కొద్ది సెకన్లు మాత్రమే ఉన్నా.. ప్రేక్షకులు, బన్నీ ఫ్యాన్స్‌ మళ్లీ మళ్లీ చూస్తున్నారు. అల్లు అర్జున్ కొత్త గెటప్‌లో కనిపించడం అందరినీ అబ్బురపరుస్తోంది. ఈ టీజర్‌ను చూస్తుంటే.. పాత రికార్డులు బ్రేక్‌ చేసి పుష్ప గంగమ్మ జాతర జరిపిస్తాడని నెటిజన్లు సోషల్‌ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు.

ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో పుష్ప సినిమాను తెరకెక్కించారు. 2021లో తొలి పార్ట్‌ విడుదల అయ్యింది. బాక్సాఫీస్‌ వద్ద పెద్ద ఎత్తున వసూళ్లను రాబట్టింది. ఎర్రచందనం కూలీ నుంచి స్మగ్లింగ్ సిండికేట్‌కు నాయకుడిగా పుష్ప ఎదగడాన్ని తొలి పార్ట్‌లో చూపించారు. ఇక ఆ తర్వాత సిండికేట్‌కు లీడర్‌ అయ్యాక పుష్పకు ఎదురైన సవాళ్లు, భన్వర్‌ సింగ్ షెకావత్, దాక్షాయణి నుంచి ఎలాంటి ప్రమాదం పొంచి ఉందనే దానిపై పుష్ప-ది రూల్‌ సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. మూత్రి మూవీ మేకర్స్‌ పతాకంపై ఈ సినిమా నిర్మితం అవుతోంది. మ్యూజిక్‌ డైరెక్టర్‌గా దేవీశ్రీ ప్రసాద్ పనిచేస్తున్నాడు. ఇక పుష్ప బాక్సాఫీస్‌ను షేక్‌ చేసేందుకు ఆగస్టు 15న థియేటర్లలోకి రాబోతున్న విషయం తెలిసిందే.


Next Story