సొంత మల్టీప్లెక్స్ ను ప్రారంభించిన అల్లు అర్జున్

ఎన్నో సంవత్సరాలుగా హైదరాబాద్ లోని అమీర్ పేట్ వాసులు ఎదురుచూసిన సత్యం మల్టీప్లెక్స్ ప్రారంభం జరిగింది.

By News Meter Telugu  Published on  15 Jun 2023 8:53 PM IST
Allu Arjun, Multiplex, Minister talasani, AAA

సొంత మల్టీప్లెక్స్ ను ప్రారంభించిన అల్లు అర్జున్

ఎన్నో సంవత్సరాలుగా హైదరాబాద్ లోని అమీర్ పేట్ వాసులు ఎదురుచూసిన సత్యం మల్టీప్లెక్స్ ప్రారంభం జరిగింది. ప్రముఖ సత్యం థియేటర్ ను కూల్చి వేసి.. ఈ మల్టీప్లెక్స్ ను కట్టారు. సత్యం థియేటర్ పాతబడి పోవడంతో దాన్ని తొలగించి అదే స్థానంలో ఏషియన్ సత్యం మాల్ ను నిర్మించారు. దీనిలో అల్లు అర్జున్, ఏషియన్ సునీల్ సహా సదానంద గౌడ్, మురళీమోహన్ భాగస్వాములుగా ఉన్నారు. బుధవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ మాల్ కి సంబంధించిన మల్టీప్లెక్స్ ను ఈ రోజు అల్లు అర్జున్ ప్రారంభించారు. తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో కలిసి అల్లు అర్జున్ రిబ్బన్ కట్ చేశారు. ఈ కార్యక్రమానికి అల్లు అరవింద్ తో పాటు అల్లు అర్జున్ కుమారుడు అల్లు ఆయాన్ష్ కూడా హాజరయ్యారు.

ఈ మల్టీప్లెక్స్ లో మొత్తం ఐదు థియేటర్లు ఉన్నాయి. హైదరాబాదులో ఇప్పటివరకు లేనివిధంగా ఒక ఎల్ఈడీ స్క్రీన్ ను కూడా ఏఏఏ సినిమాస్ లో ఏర్పాటు చేశారు. ఆదిపురుష్ సినిమాతో థియేటర్ లో స్క్రీనింగ్ మొదలుకాబోతోంది. AAA సినిమాస్ ప్రత్యేకతలు ఏంటంటే.. మొత్తం 5 స్క్రీన్స్ అందుబాటులో ఉండబోతున్నాయి. మొదటి స్క్రీన్.. బార్కో లేజర్ ప్రొజెక్షన్ అండ్ ATMOS సౌండ్ కలిగి ఉంటే, సెకండ్ స్క్రీన్.. ఎపిక్ లుజోన్ స్క్రీన్ అండ్ ATMOS సౌండ్ కలిగి ఉంటుంది. ఇక మిగిలిన మూడు స్క్రీన్స్.. 4K ప్రొజెక్షన్ తో ఉండబోతున్నాయి. మొత్తం స్క్రీన్స్ Dolby 7.1 సౌండ్ తో రాబోతున్నాయి. సత్యం మాల్ లో పాపులర్ ఫుడ్ బ్రాండ్స్ తో బిగ్ ఫుడ్ కోర్ట్ ని కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు.

Next Story