'అంజలి' వీడియో సాంగ్‌లో అద‌ర‌గొట్టిన బ‌న్నీ కూతురు.. వీడియో వైర‌ల్‌

Allu Arha's Anjali Anjali Video Song I ‘అంజలి’ వీడియో సాంగ్‌లో అద‌ర‌గొట్టిన బ‌న్నీ కూతురు.. వీడియో వైర‌ల్‌

By సుభాష్  Published on  21 Nov 2020 8:32 AM GMT
అంజలి వీడియో సాంగ్‌లో అద‌ర‌గొట్టిన బ‌న్నీ కూతురు.. వీడియో వైర‌ల్‌

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గారాల ప‌ట్టి అర్హ పుట్టిన రోజు నేడు. ఈ సంద‌ర్భంగా బ‌న్నీ త‌న యూట్యూబ్ ఛాన‌ల్‌లో ఓ వీడియో సాంగ్‌ను విడుద‌ల చేశాడు. లెజండరీ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన అద్భుత చిత్రాల్లో అంజలి ఒకటి. 1990లో విడుద‌లైన ఈ చిత్రం అప్ప‌ట్లో పెద్ద విజ‌యం సాధించింది. మాస్ట్రో ఇళయరాజా సంగీతాన్ని అందించిన ఈ చిత్రంలోని అంజలి అంజలి అంజ‌లి అనే పాటను ఎవ్వ‌రూ అంత త్వ‌ర‌గా మ‌రిచిపోరు. ఇప్పటికీ పాట ఎక్కడో ఒకచోట వినిపిస్తూనే ఉంటుంది. తాజాగా ఈ సినిమాలోని టైటిల్ సాంగ్‌ను అల్లు అర్హతో మళ్లీ రీ క్రియేట్‌ చేసి వీడియో సాంగ్‌ను విడుదల చేశాడు.

ఈ వీడియో సాంగ్‌లో అర్హ‌ తన క్యూట్‌ క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్‌లతో ఆకట్టుకుంటోంది. ఇక ఈ వీడియోలో బన్నీ కుమారుడు అయాన్ కూడా ఉండగా.. అల్లు అరవింద్‌, అల్లు అర్జున్ ఎంట్రీ ఇవ్వ‌డం.. ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. ప్ర‌స్తుతం ఈ సాంగ్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఇందుకెందు ఆల‌స్యం మీరు ఓ సారీ చూసేయండి.


Next Story