ఓటీటీలోకి అల్లరి నరేశ్‌ కామెడీ ఎంటర్‌టైనర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

అల్లరి నరేశ్‌ హీరోగా రీసెంట్‌గా వచ్చిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ 'ఆ ఒక్కటీ అడక్కు'.

By Srikanth Gundamalla  Published on  30 May 2024 10:00 AM IST
allari naresh,  movie, ott streaming, prime,

 ఓటీటీలోకి అల్లరి నరేశ్‌ కామెడీ ఎంటర్‌టైనర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

అల్లరి నరేశ్‌ హీరోగా రీసెంట్‌గా వచ్చిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ 'ఆ ఒక్కటీ అడక్కు'. ఈ మూవీ థియేటర్లలో మే 3న విడుదల అయ్యింది. మిశ్రమ స్పందనను అందుకుంది. కొందరు సినిమా.. కామెడీ బాగుందంటే.. ఇంకొందరు లైట్‌ తీసుకున్నారు. ఈ క్రమంలోనే అనుకున్నంత కలెక్షన్లను సినిమా రాబట్టలేకపోయిందని అంటున్నారు సినీ విశ్లేషకులు. కొన్ని సినిమాలు థియేటర్లలో బాగా ఆడకపోయినా.. ఓటీటీల్లో మాత్రం బాగా రన్‌ అవుతాయి. విశేష ఆదరణను అందుకుంటాయి. ఈ క్రమంలోనే సడెన్‌గా అల్లరి నరేశ్ కొత్త మూవీ ఓటీటీలోకి వచ్చేసింది.

ఆ ఒక్కటీ అడక్కు సినిమాలో హీరోయిన్‌గా జాతిరత్నాలు ఫేమ్‌ ఫరియా అబ్దుల్లా నటించింది. చోటాభీమ్ కార్టూన్ నిర్మాత రాజీవ్‌ చిలక నిర్మించగా.. మల్లి అంకం దర్శకత్వం వహించాడు. వయసు మీదపడుతున్నా పెళ్లి కావడం లేదని గణపతి (అల్లరి నరేశ్) మ్యాట్రిమోనిని సంప్రదిస్తాడు. ఈ క్రమంలోనే సిద్ధి (ఫరియా అబ్దుల్లా) అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు. ఈ క్రమంలోనే ఆమెను పెళ్లి చేసుకుందామని అంటే.. దానికి ఆమె నిరాకరిస్తుంది. ఆ ఒక్కటీ అడక్కు అంటూ కండీషన్ పెడుతుంది. ఇక మ్యాట్రిమోనిలో రెండుసార్లు విడాకులు తీసుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు గణపతి సిద్ధం అవుతాడు. ఆ తర్వాత సిద్ధిని ఎలా కలిశాడు.? పెళ్లి చేసుకున్నాడా? పెళ్లి పేరుతో మ్యాట్రిమోని వంటి సంస్థల్లో ఎలాంటి ఘోరాలు జరుగుతున్నాయనే ఆసక్తికరమైన కథకథనాలతో సినిమా సాగుతోంది.

అయితే.. ఈ సినిమా అమెజాన్‌ ప్రైమ్‌లో సడెన్‌గానే అందుబాటులోకి వస్తుంది. మామూలుగా వారం ముందే సమాచారం ఇస్తారు. కానీ.. ప్రైమ్‌లో ఆ ఒక్కటీ అడక్కు సినిమా మే 30వ తేదీ అర్ధరాత్రి నుంచి అందుబాటులోకి రానుంది. థియేటర్లలో అల్లర్‌ నరేశ్‌ సినిమా, కామెడీని మిస్‌ అయినవారు ఓటీటీలో చూసేందుకు సిద్ధం అవుతున్నారు. మరీ ఓటీటీ ప్రేక్షకులు ఈ సినిమాకు ఎంత రేటింగ్ ఇస్తారో చూడాలి.


Next Story