హాలీవుడ్ నటికి తెలుగు నేర్పిన అలియా భట్..ఇదే వైరల్ వీడియో
సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా అలియా భట్ హాలివుడ్ నటికి తెలుగు నేర్పింది.
By Srikanth Gundamalla Published on 8 Aug 2023 5:00 PM ISTహాలీవుడ్ నటికి తెలుగు నేర్పిన అలియా భట్..ఇదే వైరల్ వీడియో
బాలీవుడ్ నటి ఆలియా భట్ తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. జక్కన తీసిన సూపర్ హిట్ మూవీ 'ఆర్ఆర్ఆర్' సినిమాతో ఆమె తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఇక ఈ సినిమా సమయంలోనే అలియా భట్ తెలుగు కూడా నేర్చుకున్నారు. ఆ తర్వాత ప్రమోషన్లలో పాల్గొని తెలుగులోనే మాట్లాడి అందరినీ ఆశ్చర్యపరిచారు. దాంతో.. అలియాను అందరూ ప్రశంసించారు కూడా. ఆర్ఆర్ఆర్ తర్వాత తెలుగులోనూ వచ్చిన బ్రహ్మాస్త్రం సినిమాతోనూ అలరించారు అలియా. అయితే.. ఇప్పుడు ఈ బాలీవుడ్ టాప్ హీరోయిన్ హాలీవుడ్‌లోకి కూడా ఎంట్రీ ఇస్తోంది. 'హార్ట్ ఆఫ్ స్టోన్' సినిమాలో నటించారు.
'హార్ట్ ఆఫ్ స్టోన్' సినిమా పూర్తిస్థాయి యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో అలియాభట్ ప్రతినాయక పాత్రలో కనిపించనున్నారు. అయితే.. ఈ సినిమా ఆగస్టు 11న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం వరుసగా ప్రమోషన్లు నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అలియా తెలుగులో మాట్లాడారు. అంతేకాదు.. తెలుగుని సహ నటులకు కూడా నేర్పించారు. 'హార్ట్ ఆఫ్ స్టోన్' హీరో, హీరోయిన్‌కు తెలుగు నేర్పించే ప్రయత్నం చేశారు. ముద్దుగా మాట్లాడుతూ అలియా నేర్పించిన పాఠం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మీడియా చిట్‌చాట్‌లో పాల్గొన్న కో స్టార్ గాల్ గాడోట్‌కు తెలుగు నేర్పించింది అలియా భట్. అందరికీ నమస్కారం.. మీకు నా ముద్దులు అంటూ గాల్ గాడోట్‌తో చెప్పింది. ఆమె కూడా తనకు పలికేందుకు రాకపోయినా కష్టపడి తెలుగు మాటలు చెప్పింది. అలియానే ఇటీవల తెలుగు నేర్చుకుంది. అలాంటిది హాలీవుడ్ నటికి భలేగా తెలుగు చెబుతోందని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఇక ముద్దుగా ముద్దుగా మాట్లాడుతున్నారంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం నెట్టింట ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఇక ప్రమోషన్లో భాగంగా ఇంకా ఒకన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు అలియా. తాను ఇప్పటి వరకు టాటూ వేయించుకోలేదని.. రణ్‌బీర్, తాను ఒకేలాంటి టాటూ వేయించుకునేందుకు ఇన్నాళ్లు వేచి చూశానని చెప్పారు. ఆ తర్వాత ఆర్ఆర్ఆర్ సినిమాలోని ఆస్కార్ అవార్డు గెలుచుకున్న నాటునాటు పాట పాడి.. డ్యాన్స్ మూమెంట్స్ వేసి అలరించారు.
అలియా ఇప్పుడే కాదు.. ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్‌లోనూ తెలుగు మాట్లాడిన విషయం తెలిసిందే. అలాగే 'బ్రహ్మాస్త్రం' సినిమా విడుదల అప్పుడు కూడా ఇంటర్వూలో కూడా అందులోని పాటను తెలుగు పాడి అందరినీ ఆకట్టుకున్నారు. ఇటీవల అలియా నటించిన 'రాకీ ఔర్ రాణీ కి ప్రేమ్ కహాని' సినిమా ప్రేక్షకులను ఆకట్టుంది. దాంతో.. మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది అలియాభట్.
See how Alia Bhatt trains Gal Gadot to speak Telugu 😀 pic.twitter.com/Lc2aoCIdyd
— Christopher Kanagaraj (@Chrissuccess) August 8, 2023