జర్నలిస్ట్‌ చెప్పుని చేత్తో ఇచ్చిన ఆలియా భట్, గ్రేట్ అంటోన్న నెటిజన్లు

జర్నలిస్ట్‌ చెప్పుని చేత్తో తీసి మరి ఇదిగో వేసుకోండి అంటూ ఇచ్చింది ఆలియా.

By Srikanth Gundamalla  Published on  15 July 2023 7:53 AM IST
Alia Bhatt, Journalist Chappal, Viral,

జర్నలిస్ట్‌ చెప్పుని చేత్తో ఇచ్చిన ఆలియా భట్, గ్రేట్ అంటోన్న నెటిజన్లు

ఎంత పెద్ద స్టార్లు అయినా సామాన్యుల్లానే ఉండేందుకు ఇష్టపడతారు కొందరు. ఆ కోవకు చెందిన వారిలో ఒకరే ఆలియా భట్. ఇటీవల ఆమె చేసిన పని అలా ఉంది మరి. ముంబైలో ఫోటోలు తీసుకుంటోన్న జర్నలిస్ట్‌ చెప్పు ఉడిపోవడంతో.. ఆలియా భట్‌ చేత్తో తీసి మరి ఆ చెప్పును అతనికి అందజేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది.

బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్‌ను ఆస్వాదిస్తోంది. ఇటీవల ఆలియా తన తల్లి, సోదరితో కలిసి ముంబైలోని ఓ రెస్టారెంట్‌కు వెళ్లింది. ఈ సందర్భంగా అక్కడ ఆలియాను చూసిన జర్నలిస్ట్‌లు ఫొటోలు తీసే ప్రయత్నం చేశారు. ముగ్గురు కలిసి ఒక ఫోజు ఇవ్వాలంటూ కోరారు. ఇంతలో అక్కడ ఉన్న భద్రతా సిబ్బంది జర్నలిస్టులను వెనక్కి జరగాలని సూచించారు. హడావిడిగా వెనక్కి వెళ్లిన జర్నలిస్టుల్లో ఒకరి చెప్పు ఊడి కిందపడిపోయింది. దాంతో ఆ జర్నలిస్ట్‌ చెప్పు లేకుండానే నడవడాన్ని గమనించింది ఆలియా భట్. కారు వైపుగా వస్తూ చెప్పుని చూసింది.. ఎవరో చెప్పు జార విడుచుకున్నారు.. ఇది ఎవరిదీ అంటూ ప్రశ్నించింది.

స్పందించిన జర్నలిస్టులు మీరేం పట్టించుకోకండి.. ఇలాంటివి జరుగుతుంటాయి అంటూనే ఉన్నారు. మీరు మాత్రం ఫొటోకి ఫోజులు ఇవ్వండి అంటూ కోరారు. కానీ ఆలియా మాత్రం జర్నలిస్టులు చెబుతున్నా వినలేదు. సదురు జర్నలిస్ట్‌ చెప్పుని చేత్తో తీసి మరి ఇదిగో వేసుకోండి అంటూ ఇచ్చింది. ఆలియా అలా జర్నలిస్ట్‌ చెప్పుని చేతితో తీసి ఇవ్వడంతో అక్కడున్నవారంతా షాక్‌ అయ్యారు. స్టార్ హీరోయిన్‌గా ఉండి ఆమె సాధారణ వ్యక్తిలా వ్యవహరించడంతో ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. నెటిజన్లు మేడమ్‌ మీరు గ్రేట్‌ అంటూ కామెంట్స్‌ పెడుతున్నారు.

ఆర్ఆర్ఆర్ తో టాలీవుడ్ ఆడియన్స్ మనసుదోచిన ఆలియా.. తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గర అయ్యింది. బ్రహ్మాస్త్ర సినిమా కూడా తెలుగులో రిలీజ్ అవ్వడంతో.. మన హీరోయిన్ అనిపించుకుంది బ్యూటీ. ఇటీవలే పాపకు జన్మనిచ్చిన ఆలియా.. కూతురు బాగోగులు చూసుకుంటోంది. కాగా.. ఇప్పటికే ఆలియా నటించిన రెండు సినిమాలు ఇప్పుడు రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. వాటిలో ఒకటి హాలీవుడ్ మూవీ కాగా.. మరొకటి బాలీవుడ్ మూవీ. కొద్ది రోజుల్లోనే ఆలియా భట్‌ మళ్లీ షూటింగుల్లో పాల్గొననుందని తెలుస్తోంది.

Next Story