యూట్యూబ్ ఛానెల్‌పై రూ.500 కోట్ల పరువు నష్టం దావా వేసిన అక్షయ్ కుమార్
Akshay Kumar's Rs 500 Crore Defamation Suit on YouTuber.. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో తన పేరును తప్పుగా
By సుభాష్ Published on 19 Nov 2020 9:45 AM GMTసుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో తన పేరును తప్పుగా ప్రస్తావించినందుకు నటుడు అక్షయ్ కుమార్ ఓ యూట్యూబ్ ఛానెల్‌కు రూ.500 కోట్ల నష్టం నోటీసులు పంపారు. నకిలీ వార్తలను వ్యాప్తి చేసి, మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే, అతని కుమారుడు ఆదిత్య ఠాక్రే పేరును లాగినందుకు పోలీసులు గతంలో అరెస్టు చేసిన యూట్యూబర్ రశీద్ సిద్ధిఖీపై ఇప్పుడు 500 కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేశారు. అక్షయ్ కుమార్.
బీహార్ కు చెందిన యూట్యూబ్ రశీద్ సిద్ధిఖీ 'ఎఫ్‌ఎఫ్‌న్యూస్' అనే యూట్యూబ్ ఛానెల్‌లో తప్పుడు సమాచారం, దుర్వినియోగ వీడియోలను పోస్టు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే సుశాంత్‌సింగ్ గురించి యూట్యూబర్ తప్పుడు వీడియోలను తయారు చేసి అప్ లోడ్ చేశాడు. ఈ కేసు వెలుగులోకి వచ్చిన తర్వాత ముంబై పోలీసులు యూట్యూబర్‌పై కేసు నమోదు చేశారు. అయితే దర్యాప్తులో పోలీసులతో సహకరిస్తాను అనే షరతుపై అతనికి బెయిల్ లభించింది.
రశీద్ వృత్తి రీత్యా సివిల్ ఇంజనీర్
కాగా, బీహార్‌కు చెందిన రశీద్ వృత్తిరీత్యా సివిల్ ఇంజనీర్. ఎఫ్‌ఎఫ్ న్యూస్ అనే యూట్యూబ్ ఛానెల్ నడుపుతున్నాడు. దీనిపై ముంబై పోలీసులు, ఆదిత్య ఠాక్రే, అక్షయ్ కుమార్‌లపై కొన్ని అవమానకరమైన వీడియోలు పోస్టులు చేశారు. శివసేన లీగర్ సెల్ తరపున న్యాయవాది ధర్మేంద్ర మిశ్రా రశీద్‌పై కేసు పెట్టారు. దీని తర్వాత ముంబై పోలీసులు రశీద్‌పై పరువు నష్టం, ఉద్దేశ పూర్వకంగా అవమానించారనే ఆరోపణలపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
అదే కారణంతో రశీదుకు పరువు నష్టం నోటీసులు
కాగా, రశీదు తన యూట్యూబ్ ఛానెల్‌లో అక్షయ్ కుమార్‌కు వ్యతిరేకంగా ఒక వీడియోను పోస్టు చేసినట్లు అక్షయ్ ఆరోపించారు.ఇందులో సుశాంత్ 'ఎంఎస్‌ధోని' సినిమా పొందడం పట్ల అక్షయ్ అసంతృప్తిగా ఉన్నాడని తప్పుడు సమాచారం వైరల్ చేశాడు. ఇది మాత్రమే కాకుండా సుశాంత్ మరణం విషయంలో అక్షయ్ ఆదిత్యతో రహస్యంగా సమావేశమై రియాను కెనడాకు పంపించడానికి సహాయం చేసినట్లు కూడా ఉంది. మొత్తం విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత అక్షయ్ అదే కారణంగా రశీదుకు పరువు నష్టం నోటీసులు పంపాడు.